తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై నాగబాబు ఎమోషనల్ ట్వీట్..

మెగాబ్రదర్ నాగబాబు తన సోదరులైన చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లపై బ్రదర్స్ డే సందర్భంగా ఎమోషనల్ ట్వీట్  చేసారు. ఈ ట్వీట్ సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 24, 2020, 4:16 PM IST
తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై నాగబాబు ఎమోషనల్ ట్వీట్..
అన్నా తమ్ముడు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో నాగబాబు (Twitter/Photo)
  • Share this:
మెగాబ్రదర్ నాగబాబు తన సోదరులైన చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లపై బ్రదర్స్ డే సందర్భంగా ఎమోషనల్ ట్వీట్  చేసారు. వాళ్లిద్దరు లేకపోతే నేను లేను అంటూ చెప్పుకొచ్చాడు.  తన జీవితంలో ఒడిదుడుకుల్లో తనకు ఎల్లవేలల తనకు అన్నయ్య చిరంజీవితో పాటు తమ్ముడు పవన్ కళ్యాణ్ తోడుగా నిలిచారు. వాళ్లిద్దరి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. తన జీవితం నా సోదరులకే అంకితం అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. అప్పట్లో నాగబాబు.. తన అన్న సహకారంలో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి పలు చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాల్లో ఎక్కువ భాగం ఫ్లాప్ చవిచూసాయి. మొత్తంగా తన ఇంట్లో ఇండస్ట్రీని శాసించే హీరోలున్న వాళ్లతో హిట్ చిత్రాలను నిర్మించలేకపోవడం నిజంగానే నాగబాబు దురదృష్టమనే చెప్పాలి. ఒకానొక సమయంలో రామ్ చరణ్‌తో నిర్మించిన ‘ఆరెంజ్’ సినిమా కారణంగా నాగబాబు అప్పులపాలయ్యాడు. ఒక దశలో ఆత్మహత్య చేసుకుందామనుకునట్టు ఓ సందర్భంలో నాగబాబు చెప్పిన  సంగతి తెలిసిందే కదా. ఆ సమయంలో నాగబాబును ఆదుకోవడానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ , అన్నయ్య చిరంజీవి ఆర్ధికంగా సాయం చేసినట్టు చెప్పుకొచ్చాడు.


కెరీర్ మొదట్లో తన కోసమంటూ ఏది చూసుకోలేదని అన్నయ్య లోకంగా బతికానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తనకంటూ ఓ జీవితం ఉందని గుర్తుకు వచ్చిందన్నారు. నాగబాబు నిన్నమొన్నటి వరకు జబర్ధస్త్ షోతో ఆర్ధికంగా బాగా నిలదొక్కున్నారు. ఇపుడు అదరింది షోలో జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక నాగబాబు తన జీవితకాల కోరిక ఒకటే ఒకటని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించాడు. అన్నయ్య చిరంజీవి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుంటే చూడాలని ఉందని చెప్పుకొచ్చారు. మొత్తానికి బ్రదర్స్ డే సందర్భంగా నాగబాబు చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 24, 2020, 4:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading