Home /News /movies /

NAGA BABU BECOMES SUPER SLIM SHARES PICS ON SOCIAL MEDIA SR

నాగబాబు చేసిన పనికి అవాక్కవుతున్న జనాలు..

నాగబాబు (Twitter/Nagababu)

నాగబాబు (Twitter/Nagababu)

నటుడు నాగబాబు చేసిన ఓ పని అందర్నీ అశ్చర్యానికి గురి చేస్తోంది.

    నటుడు నాగబాబు భారీకాయం నుంచి చాలా స్లిమ్‌గా ఆకర్షణీయంగా మారాడు. దానికి సంబందించిన ఓ ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అనుకున్నాను సాధించాను.. అంటూ తన పాత కొత్త ఫోటోలను జత చేసి అభిమానులతో పంచుకున్నాడు. పరిమిత ఆహారంతో పాటు రెండు పూటల సరిపడ శారీరక వ్యాయామం తనను ఇలా మార్చిందని తెలిపాడు. అంతేకాదు సన్నగా ఉండడమే ఆరోగ్యానికి మేలని అంటున్నాడు నాగబాబు. తనకు బరువు తగ్గడానికి ఆరు నెలలు పట్టిందని పేర్కొంటూ.. మూడు ఫొటోలను మిక్స్ చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతో అభిమానుల నుండి కామెంట్లు, లైక్ లు వెల్లువెత్తుతున్నాయి. బరువు తగ్గడానికి ప్రణాళిక ప్రకారం ఆహారం తీసుకోవడం.. వయసు, ఎత్తుకు తగ్గ బరువు మెయిన్ టెయిన్ చేయాలంటూ నాగబాబు తాను పాల్గొంటున్న షోల్లో నటీనటులకు సలహాలు ఇస్తుంటారు. అయితే, ఇతరులకు చెప్పేముందు తాను కూడా అనుసరించాలని నిర్ణయించుకుని బరువు తగ్గి ఆకర్షణీయంగా తయారయ్యాడు. రోజుకు ఒక పూట మాత్రమే తింటూ ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు వ్యాయామం చేసానని నాగబాబు తెలిపాడు. అది అలా ఉంటే ప్రస్తుతం నాగబాబు జబర్ధస్త్‌ను వదిలేసి జీ తెలుగులో అదిరిందికి జడ్జ్‌గా చేస్తున్నాడు. ఈ కొత్త కామెడీ షో కూడా ప్రేక్షకుల్నీ బాగానే ఆకట్టుకుంటోంది.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Nagababu

    తదుపరి వార్తలు