Home /News /movies /

NAG CHAITANYA AND SAI PALLAVI STARRER LOVE STORY MOVIE IS ALSO BLOCKBUSTER IN SMALL SCREEN FIRST TIME TRP RATE IS 18 01 SRD

Love Story : తగ్గేదే లే.. బుల్లి తెరపై కూడా దుమ్మురేపిన లవ్ స్టోరీ.. ఎంత రేటింగ్ అంటే..

Love Story

Love Story

Love Story : నాగచైతన్య, సాయి పల్లవిల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులవివక్షత.. అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటన నేపథ్యంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.

    చాలా కాలం తర్వాత సినీ పరిశ్రమలో జోష్ పెంచింది లవ్ స్టోరీ సినిమా(Love Story Movie). థియేటర్లలో విడుదలై ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్‏గా నిలవడమే కాకుండా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆల్ టైం రికార్డ్ సాధించింది. ఇందులో అక్కినేని నాగచైతన్య (Nag Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) హీరో హీరోయిన్లుగా నటించగా… క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Shekhar Kammula) తెరకెక్కించారు. సెప్టెంబర్ లో థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాక ఈ చిత్రం థియేటర్ల లో మంచి వసూళ్ళను రాబట్టడం జరిగింది. తన మేనమామ వెంకటేష్‌తో కలిసి ‘వెంకీమామ’ సినిమా తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన సినిమా ‘లవ్ స్టోరీ’. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ‘ఫిదా’ తర్వాత మరోసారి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంది.

    ఇందులో నాగచైతన్య, సాయి పల్లవిల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులవివక్షత.. అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటన నేపథ్యంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.తాజాగా ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. స్టార్ మా లో ప్రసారం అయిన ఈ చిత్రానికి తొలిసారి సాలిడ్ టీఆర్పీ ను రాబట్టడం జరిగింది.

    ఇది కూడా చదవండి :  అఖండ మూడు వారాల కలెక్షన్స్... బాక్సాఫీస్ దగ్గర తగ్గని బాలయ్య దూకుడు..

    ఈ చిత్రం తొలిసారిగా 18.01 టీఆర్పీని రాబట్టి బుల్లితెర పై కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లవ్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టడం విశేషం. రిలీజ్ అయిన మొదటి రోజే ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. అమెరికాలో 224 లొకేష‌న్స్‌లో ల‌వ్‌స్టోరి ప్రీమియ‌ర్స్ వేస్తే, 3,07,103 డాల‌ర్స్ వసూలు చేసింది.

    ఇది కూడా చదవండి : పవన్ కళ్యాణ్ లిస్టులో మరో సూపర్ హిట్ రీమేక్.. ఈ సారి మాత్రం..

    ఇక ఫస్ట్ డే 144 లొకేష‌న్స్‌ల్లో 85,232 డాల‌ర్స్ కలెక్షన్లు రాబట్టింది. మన దేశ కరెన్సీలో లవ్ స్టోరీ యుఎస్ లో మొదటి రోజు రూ.2.9 కోట్ల కలెక్షన్లు రాబట్టి.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇంత భారీ ఓపినింగ్ కలెక్షన్ల రాబట్టిన సినిమాగా నిలిచింది.‘లవ్ స్టోరీ'. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 2, 2020లోనే రిలీజ్ కావాల్సింది. అయితే కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ మూవీ చైతన్య కెరీర్‌లోనే బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Love Story Movie, Naga Chaitanya, Sai Pallavi, Tollywood news

    తదుపరి వార్తలు