హోమ్ /వార్తలు /సినిమా /

పవన్ రీ ఎంట్రీ వెనక నాదెండ్ల మనోహర్ సంచలన నిజాలు..

పవన్ రీ ఎంట్రీ వెనక నాదెండ్ల మనోహర్ సంచలన నిజాలు..

పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ (Pawan Kalyan Nadendla Manohar)

పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ (Pawan Kalyan Nadendla Manohar)

Pawan Kalyan: ఊరికే పవన్ సినిమాలు చేస్తున్నాడు అంటున్నారే కానీ ఈయన రోజులో ఎన్ని గంటలు దీనికోసం కేటాయిస్తున్నాడో తెలుసా అంటూ జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పవన్‌తో పాటే ఉన్న నాదెండ్ల మనోహర్..

పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం ఇప్పుడు చాలా మందికి తప్పుగా కనిపిస్తుంది. ఆయన రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయడం ఏంటి.. చిత్తశుద్ధి అంటే ఇదేనా కొందరు బాహాటంగానే పవన్‌పై విమర్శలు చేసారు. దీనికి పవన్ కూడా సమాధానమిచ్చాడు. తనకు వేరే వ్యాపారాలు లేవని.. వందల కోట్ల ఆస్తులు లేవని.. ఎక్కువ జీతాలు వచ్చే జాబులు కూడా కావని సెటైర్లు వేసాడు. ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల్లో సినిమాలు చేస్తే కానీ డబ్బులు రావని చెబుతున్నాడు. తనకు సినిమాలు అవసరమే కానీ ప్రాణం, ఇష్టం కాదంటున్నాడు. తనకు డబ్బులు వచ్చే మార్గాలే ఉంటే సినిమాలు ఎందుకు చేస్తానని అడుగుతున్నాడు ఈయన.

పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ (Pawan Kalyan Nadendla Manohar)
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Nadendla Manohar)

ఊరికే పవన్ సినిమాలు చేస్తున్నాడు అంటున్నారే కానీ ఈయన రోజులో ఎన్ని గంటలు దీనికోసం కేటాయిస్తున్నాడో తెలుసా అంటూ జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పవన్‌తో పాటే ఉన్న నాదెండ్ల మనోహర్.. ఆయన రీ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. తనకు అవసరం అనిపించిన రోజు షూటింగ్ క్యాన్సిల్ చేస్తాననే కండీషన్ ఒప్పుకుంటేనే సినిమాలు చేస్తానని ముందే నిర్మాతలకు పవన్ చెబుతున్నట్లు తెలిపాడు నాదెండ్ల. అంతేకాదు.. ఆయన కోసం ప్రత్యేకంగా నిర్మాతలే ఫ్లైట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. అన్నింటికీ మించి పవన్ కళ్యాణ్ సినిమాల కోసం రోజులో ఎన్ని గంటలు కాల్షీట్స్ ఇస్తున్నాడో తెలుసా..?

పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ (Pawan Kalyan Nadendla Manohar)
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Nadendla Manohar)

తెలిస్తే నిజంగానే షాక్ తప్పదు.. 24 గంటల్లో కేవలం 4 గంటలు మాత్రమే సినిమాల కోసం కేటాయిస్తున్నాడు పవర్ స్టార్. మిగిలిన సమయం రాజకీయాల్లోనే ఉంటున్నాడు. మరి ఇప్పుడు పింక్ రీమేక్ అంటే త్వరగానే అయిపోతుంది.. కానీ ఆ తర్వాత మరో రెండు సినిమాలు ఒప్పుకున్నాడు.. దానికి పూర్తిస్థాయి పవన్ కళ్యాణ్ డేట్స్ కావాలి.. మరి అప్పుడేం చేస్తాడు..? అప్పుడు కూడా ఇలాగే రోజులో 4 గంటలు షూటింగ్ అంటే మాత్రం నిర్మాతల నెత్తిన గుడ్డ పడక తప్పదు. మరి చూడాలిక.. అప్పుడేం జరగబోతుందో..? క్రిష్‌తో ఓ పీరియాడికల్ మూవీ.. హరీష్ శంకర్‌‌తో కమర్షియల్ సినిమా చేయబోతున్నాడు పవర్ స్టార్.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Nadendla Manohar, Pawan kalyan, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు