Nabha Natesh : నభా నటేష్.. ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగువారిని పలకరించిన నభా.. పూరి జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'లో చాందిని పాత్రలో నటించి యూత్‌లో యమ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో రామ్ స్పీడ్‌కు ఎక్కడా తగ్గకుండా అదిరిపోయే నటనతో పాటు అందచందాలను ఆరబోస్తూ.. తెలంగాణ యాసలో అదరగొట్టింది ఈ కన్నడ భామ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తెలుగులో అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. అందులో భాగంగా నభా నటేష్ రవితేజ హీరోగా వచ్చిన డిస్కోరాజాలో నటించింది. ఈ భామ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోశ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటిస్తోంది. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు నభా 'సోలో బ్రతుకే సో బెటరు' లో కూడా నటిస్తోంది. అది అలా ఉంటే నభాకు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో నటించే అద్భుత అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ NTR30పేరుతో ఓ కొత్త చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కోసం నభాను ఎంపిక చేసినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో నభా తెలంగాణ అమ్మాయి పాత్రలో కనిపించనుందట. ఇక ఈ చిత్రానికి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసినీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.