Nithin-Nabha Natesh : నితిన్‌‌తో ఇస్మార్ట్ పోరి ఫిక్స్.. మరో కీలక పాత్ర కోసం వేట..

Nabha Natesh :  నభా నటేష్‌.. ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌లలో ఒకరు.

news18-telugu
Updated: August 19, 2020, 7:24 AM IST
Nithin-Nabha Natesh : నితిన్‌‌తో ఇస్మార్ట్ పోరి ఫిక్స్.. మరో కీలక పాత్ర కోసం వేట..
నితిన్ Photo : Twitter
  • Share this:
Nabha Natesh :  నభా నటేష్‌.. ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌లలో ఒకరు. ఈ భామ మొదట ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగువారిని పలకరించింది. అయితే ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ పూరి జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో చాందిని పాత్రలో నటించి యూత్‌‌లో యమ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో రామ్ స్పీడ్‌కు ఎక్కడా  తగ్గకుండా అదిరిపోయే నటనతో పాటు అందచందాలతో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో తెలుగులో అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇటీవలే నభా నటేష్ రవితేజ హీరోగా వచ్చిన డిస్కోరాజాలో నటించింది. ఈ భామ ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో న‌టిస్తోంది. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అది అలా ఉంటే ఈ భామ నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో హిందీలో సూపర్ హిట్ అయిన అంధాధున్ సినిమాని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్‌గా నటించనుందని మొదట్లో టాక్ రాగా.. చివరకు ఆ అవకాశం కన్నడ బ్యూటీ నభా నటేష్‌కు వచ్చిందని తెలుస్తోంది.

Nabha Natesh, Nayanthara, Ileana rejects nithin andhadhun, Ileana news, Nithin and Keerthy suresh rang de,Nithin and Keerthy suresh rang de movie updates,Nithin films,Keerthy suresh rang de ,Keerthy suresh films, telugu films, నితిన్ రంగ్ దే, కీర్తి సురేష్, తెలుగు సినిమాలు, నభా నటేష్, అంధాదున్
నితన్, ప్రియాంక, నభా నటేష్ Photo : Twitter


ఇక ఈ సినిమాలో హీరోతో పాటు సమానంగా ఉండే టబు పాత్రను తెలుగులో ఎవరితో చేయిస్తే బాగుంటదని ఆలోచిస్తోన్న చిత్రబృందం ఈ పాత్ర కోసం చాలా మందినే పరిశీలించింది. కొంత నెగెటివ్ టచ్ ఉన్న ఈ పాత్రను తెలుగులో కూడా ఆమె చేయనుందని కొన్ని రోజులు టాక్ నడిచింది. ఆ తరువాత ఆ పాత్ర అనసూయకు దక్కిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులు రమ్యకృష్ణ అని టాక్ నడిచింది. అయితే ఈ పాత్ర చేయాలంటే రమ్య కృష్ణ భారీ మొత్తంలో డిమాండ్ చేస్తోందట. దీంతో ఈ నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానాని కూడా పరిశీలించింది చిత్రబృందం. అయితే ఆ పాత్రకి ఆమె సింపుల్‌గా నో చెప్పేసిందట. దీనికి కారణం లేకపోలేదు. ఇలియానా గతంలో నితిన్‌తో రెచ్చిపో అనే సినిమా చేసింది. అందుకే మళ్ళీ ఇప్పుడు నితిన్ తో నెగటివ్ క్యారెక్టర్ చేస్తే ఆమె కెరీర్ గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయిపోతుందని భావించి ఉండవచ్చని అంటున్నారు.

Nabha Natesh, Nayanthara, Ileana rejects nithin andhadhun, Ileana news, Nithin and Keerthy suresh rang de,Nithin and Keerthy suresh rang de movie updates,Nithin films,Keerthy suresh rang de ,Keerthy suresh films, telugu films, నితిన్ రంగ్ దే, కీర్తి సురేష్, తెలుగు సినిమాలు, నభా నటేష్, అంధాదున్
అనసూయ, రమ్యకృష్ణ, నయనతార Photo : Twitter


ఇక అదే పాత్రకోసం మరో హిందీ నటి శిల్పాశెట్టిని సంప్రదించగా.. ఆమె కూడా బిజీ అని చెప్పి..‘నో’ చెప్పినట్లుగా టాక్. ఇక చివరకు ఈ బోల్డ్ నెస్ తో కూడిన నెగెటివ్ రోల్ కోసం స్టార్ హీరోయిన్ నయనతారను తీసుకోవాలనే ప్రయత్నాలలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఆమెను సంప్రదించారని.. అయితే ఆమె కూడా నో అన్నదట. దీంతో ఏం చేయాలో తెలియని చిత్ర యూనిట్ కొంతకాలం పాటు ఈ చిత్రాన్ని వాయిదా వేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లుగా టాక్ నడుస్తుంది. చూడాలి మరి చివరకు ఈ పాత్రలో నటించే అదృష్టం ఎవరికి దక్కుతుందో.. ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే ఆయన.. ప్రస్తుతం కీర్తి జంటగా దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తోన్న రంగ్ దే సినిమాలో నటిస్తున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: August 19, 2020, 7:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading