Nabha Natesh :  అందనంత దూరంలో నభా నటేష్.. కష్టం అంటున్న నిర్మాతలు..

Nabha Natesh : నభా నటేష్‌.. ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌లలో ఒకరు.

news18-telugu
Updated: April 28, 2020, 12:52 PM IST
Nabha Natesh :  అందనంత దూరంలో నభా నటేష్.. కష్టం అంటున్న నిర్మాతలు..
నభా నటేష్ Photo : Twitter
  • Share this:
Nabha Natesh :  నభా నటేష్‌.. ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌లలో ఒకరు. ఈ భామ మొదట ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగువారిని పలకరించింది. అయితే ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ పూరి జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో చాందిని పాత్రలో నటించి యూత్‌‌లో యమ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో రామ్ స్పీడ్‌కు ఎక్కడా  తగ్గకుండా అదిరిపోయే నటనతో పాటు అందచందాలతో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో తెలుగులో అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇటీవలే నభా నటేష్ రవితేజ హీరోగా వచ్చిన డిస్కోరాజాలో నటించింది. ఈ భామ ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోశ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో న‌టిస్తోంది. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అది అలా ఉంటే నభా నటేశ్ కి గల క్రేజ్ కారణంగా, ఆమెకు వరుస అవకాశాలు వెళుతూనే వున్నాయట. దీంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఒంట బట్టించుకున్న నభా.. తన పారితోషికాన్ని ఓ రేంజ్‌లో పెంచిందట. స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో ఆమె పారితోషికం వుండటంతో, అంతటి సాహసం చేయలేక దర్శక నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారని చెప్పుకుంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. నిర్మాతలకు అందనంత ఎత్తులో ఉండటంతో ఆమెకి బదులుగా వేరే హీరోయిన్స్ ను సంప్రదిస్తున్నారట.
First published: April 28, 2020, 12:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading