ఆ హీరోకు నేను వీరాభిమానిని, అవకాశం ఊహించలేదు : నభా నటేష్

నభా నటేష్‌.. ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌లలో ఒకరు. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడారు..

news18-telugu
Updated: January 20, 2020, 7:50 AM IST
ఆ హీరోకు నేను వీరాభిమానిని, అవకాశం ఊహించలేదు : నభా నటేష్
Instagram/nabhanatesh
  • Share this:
నభా నటేష్‌.. ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌లలో ఒకరు. నభా.. మొదట ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో అలరించింది. అయితే పూరి జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో చాందిని పాత్రలో నటించి యూత్‌‌లో యమ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో రామ్ స్పీడ్‌కు ఎక్కడా  తగ్గకుండా అదిరిపోయే నటనతో పాటు అందచందాలతో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో తెలుగులో అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం నభా నటేష్ రవితేజ హీరోగా వస్తోన్న డిస్కోరాజాలో నటిస్తోంది. ఈ సినిమా ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించింది. నభా ఓ ప్రశ్నకు సమాధానంగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో అదిరిపోయే విజయం దక్కిందని.. దీంతో ఎక్కడికి వెళ్లినా ఆ సినిమాలోని నా పాత్ర గురించి ప్రస్తావిస్తున్నారు. ఇంకా ఆ మత్తులోనే ఉండాలనిపిస్తోంది అని తెలిపింది. నభా.. రవితేజ గురించి మాట్లాడుతూ.. రవితేజ అంటేనే అల్లరని.. సెట్లో ఎప్పుడూ ఖాళీగా ఉండేవారు కాదు. ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. చాలా సలహాలు ఇచ్చారని చెప్పింది. అంతేకాదు తాను ఆయనకు వీరాభిమానిని.. రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ తనకు ఇష్టమైన సినిమా అంటూ రవితేజతో కలిసి పనిచేసే అవకాశం ఇంత త్వరగా వస్తుందనుకోలేదని పేర్కోంది. ‘డిస్కోరాజా’ను వి.ఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.
సోనారిక భడోరియా అందాలు చూస్తే మతిపోవాల్సిందే..
Published by: Suresh Rachamalla
First published: January 20, 2020, 7:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading