HOME » NEWS » movies » NABHA NATESH INTERACTS WITH MEDIA AND SAYS SHE IS LUCKY IN THAT TERMS FULL DETAILS HERE SR

Nabha Natesh : ఆ విషయంలో నేను లక్కీ.. నటనలో వేరియేషన్‌ చూపించాలనేది నా తపన : నభా నటేష్..

Nabha Natesh :  నభా నటేష్‌.. ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌లలో ఒకరుగా ఉంటూ నటనతో కాకుండా తన అందచందాలతో అదరగొడుతోన్న కన్నడ బ్యూటీ.

news18-telugu
Updated: January 13, 2021, 6:55 AM IST
Nabha Natesh : ఆ విషయంలో నేను లక్కీ.. నటనలో వేరియేషన్‌ చూపించాలనేది నా తపన : నభా నటేష్..
నభా నటేష్ Photo : Instagram
  • Share this:
Nabha Natesh :  నభా నటేష్‌.. ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌లలో ఒకరుగా ఉంటూ నటనతో కాకుండా తన అందచందాలతో అదరగొడుతోన్న కన్నడ బ్యూటీ. నభా నటేష్ మొదట ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగువారిని పలకరించింది. అయితే ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో చాందిని పాత్రలో నటించి యూత్‌‌లో యమ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో రామ్ స్పీడ్‌కు ఎక్కడా  తగ్గకుండా అదిరిపోయే నటనతో పాటు అందచందాలతో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో తెలుగులో అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఆ మధ్య నభా నటేష్ రవితేజ హీరోగా వచ్చిన డిస్కోరాజాలో నటించింది. ఆ సినిమా తుస్సుమన్న వరుసగా ఆఫర్స్ అందుకుంటూ కేకపెట్టిస్తోంది. ప్రస్తుతం ఈ భామ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోశ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో న‌టిస్తోంది. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

ఈ సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడింది. అందరికీ పోయిన సంవత్సరం 2020 కష్టంగా గడిచింది. సామాన్యులతో పాటు సెలెబ్రీటీస్‌ వరకు కొవిడ్‌ వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏడాది ఆఖరున 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్రంతోనే థియేటర్లలో పెద్ద తెలుగు సినిమాల విడుదల ప్రారంభమైంది.










View this post on Instagram






A post shared by Nabha Natesh (@nabhanatesh)





ఆ చిత్రం హిట్‌ కావటం చాలా సంతోషం కలిగించింది. ఈ ఆనందాన్ని 'అల్లుడు అదుర్స్‌' కొనసాగిస్తుందని తెలిపింది. ఈ సినిమాలో నేను ఇష్టపడి చేసిన పాత్ర అది. అంతేకాదు ఈ సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్‌గా ఉండే ఫక్తు కమర్షియల్‌ సినిమా. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ఇస్మార్ట్‌ శంకర్‌లో తెలంగాణ అమ్మాయి పాత్ర చేశాను.








View this post on Instagram






A post shared by Nabha Natesh (@nabhanatesh)













View this post on Instagram






A post shared by Nabha Natesh (@nabhanatesh)





ఇక అప్పటినుండి అందరూ నేను ఆ తరహా పాత్ర చేస్తున్నాననుకుంటున్నారు. కానీ ఈ పాత్రలో కొంత వైవిధ్యం ఉంది. ఇప్పటి దాకా నేను చేసిన పాత్రలకు చాలా భిన్నమైనదని తెలిపింది. నభా మాట్లాడుతూ.. రకరకాల పాత్రలు పోషించాలనేది నా కోరిక. నా యాక్టింగ్‌లో వేరియేషన్‌ చూపించాలనేది నా తపన. నా కెరీర్‌ మొదట్లోనే టాప్ స్టార్స్‌తో కలిసి నటించే అవకాశం రావడం.. చూస్తే తాను చాలా లక్కీ అని తెలిపింది.
Published by: Suresh Rachamalla
First published: January 13, 2021, 6:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading