హోమ్ /వార్తలు /సినిమా /

Nabha Natesh: రెమ్యునరేషన్స్ తగ్గించుకోమంటే.. షాకింగ్ సమాధానం ఇచ్చిన నభా నటేశ్‌

Nabha Natesh: రెమ్యునరేషన్స్ తగ్గించుకోమంటే.. షాకింగ్ సమాధానం ఇచ్చిన నభా నటేశ్‌

Nabha natesh Has given Shocking Answer About Her Remunaration

Nabha natesh Has given Shocking Answer About Her Remunaration

Nabha Natesh - Solo Brathuke So Better: సోలో బ్రతుకే సో బెటర్‌ విడుదల సందర్భంగా మీడియాతో నభా నటేశ్‌ వెబినార్‌లో మాట్లాడుతూ రెమ్యునరేషన్స్‌ గురించి ఆసక్తికరమైన ప్రస్తావన చేసింది. అదేంటంటే..?

  'నన్ను దోచుకుందువటే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ నభానటేశ్‌కు 'ఇస్మార్ట్‌ శంకర్‌' మంచి బ్రేక్‌ తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో నభా నటేశ్‌ ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఈ అమ్మడు హీరోయిన్‌గా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్‌' సినిమా డిసెంబర్‌ 25న థియేటర్స్‌లోకి రానుంది. దీని తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో జత కట్టిన 'అల్లుడు అదుర్స్‌' సినిమాతో సందడి చేయనుంది నభా నటేశ్‌. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణను నభా పూర్తి చేసేసింది కూడా. ఇప్పుడు నితిన్‌ సరసన అంధాదున్‌ రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాల్లో నభా నటేశ్‌ పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. కోవిడ్‌ నేపథ్యంలో సోలో బ్రతుకే సోబెటర్‌ ప్రమోషన్స్‌ను వెబ్‌ నార్‌లో యూనిట్ కండెక్ట్‌ చేస్తుంది. అందులో నభానటేశ్‌ పాల్గొంది.

  ఓ పాత్రికేయుడు ప్రస్తుతం కోవిడ్‌ ప్రభావంతో సినీ పరిశ్రమ బాగా ఇబ్బంది పడుతుంది. స్టార్స్‌ వారి రెమ్యునరేషన్స్‌లో కాస్త తగ్గించుకుంటే నిర్మాతలకు బావుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు కదా? మీరెంత శాతం రెమ్యునరేషన్‌ తగ్గించుకుంటున్నారు? అని అడగ్గా..నభా నటేశ్‌ షాకింగ్ సమాధానం ఇచ్చింది. ఇంతకీ నభా నటేశ్‌ ఏం చెప్పిందో తెలుసా? 'యాక్టర్స్‌ రెమ్యునరేషన్‌ తగ్గించుకోవాలా? ఏమో నాకు తెలియదండీ.. నా మేనేజర్‌ని అడిగి చెబుతాను' అంటూ నాకేమీ తెలియదమ్మా.. అనేలా గడుసుగా సమాధానం ఇచ్చి తప్పుకుంది. నిజానికి కోవిడ్‌ సమయంలో నిర్మాతలు ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఈ నేపథ్యంలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు నిర్మాతలకు సపోర్ట్‌ చేస్తామని, వారి రెమ్యునరేషన్స్‌ తగ్గించుకున్నారు. మరి వీరి బాటలో నభానటేశ్‌ నిలుస్తుందా? లేకపోతే సైలెంట్‌గా ఉండిపోతుందా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

  డిసెంబర్‌ 25న సాయితేజ్‌తో నభా జోడీ కట్టిన సోలో బ్రతుకే సోబెటర్‌ థియేటర్స్‌లో విడుదల కానుంది. మే 1న విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్‌ ప్రభావంతో వెనక్కి తగ్గింది. థియేటర్స్‌ మూత పడటంతో అసలు సినిమా విడుదల ఉంటుందా? లేదా? అని అందరూ అనుకుంటున్న సమయంలో రీసెంట్‌గానే యాబై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్‌ చేసుకోవచ్చునని ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో థియేటర్స్‌ ఆక్యుపెన్సీ గురించి నభా నటేశ్‌ మాట్లాడుతూ ఏదీ లేకపోవడం కంటే ఏదో ఒకటి ఉంటే బెటర్‌ కదా.. అని తెలివిగా సమాధానం చెప్పింది. ఓటీటీలో విడుదల కావాల్సిన ఈ చిత్రం మరి థియేటర్స్‌లో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూడాలి. సుబ్బు అనే డెబ్యూ డైరెక్షన్‌లో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే చిత్రాల తర్వాత సాయితేజ్‌ కూడా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలనుకుంటే సాయి తేజ్‌ స్సీడు కరోనా వైరస్‌ బ్రేకులేసింది.

  Published by:Anil
  First published:

  Tags: Ismart Shankar, Nabha Natesh, Sai Dharam Tej, Solo Brathuke So Better

  ఉత్తమ కథలు