రావాల్సిందే అంటూ నభా నటేష్‌ను ఇబ్బంది పెట్టిన నిర్మాత..

Nabha Natesh : నభా నటేష్‌.. ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌లలో ఒకరు.

news18-telugu
Updated: March 17, 2020, 6:16 PM IST
రావాల్సిందే అంటూ నభా నటేష్‌ను ఇబ్బంది పెట్టిన నిర్మాత..
నభా నటేష్ Photo : Twitter
  • Share this:
Nabha Natesh :  నభా నటేష్‌.. ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌లలో ఒకరు. ఈ భామ మొదట ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగువారిని పలకరించింది. అయితే ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ పూరి జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో చాందిని పాత్రలో నటించి యూత్‌‌లో యమ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో రామ్ స్పీడ్‌కు ఎక్కడా  తగ్గకుండా అదిరిపోయే నటనతో పాటు అందచందాలతో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో తెలుగులో అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇటీవలే నభా నటేష్ రవితేజ హీరోగా వచ్చిన డిస్కోరాజాలో నటించింది. ఈ భామ ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోశ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో న‌టిస్తోంది. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. కాగా కరోనా వైర‌స్ కార‌ణంగా సిబ్బంది ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని.. నిర్మాత‌ల మండ‌లి సినిమా షూటింగ్స్‌ను కొన్నిరోజుల పాటు వాయిదా వేసుకోవాల‌ని సూచించిన సంగతి తెలిసిందే.










View this post on Instagram





Dancy dancy 💃🏻


A post shared by Nabha Natesh (@nabhanatesh) on






దీంతో చాలా వరకు షూటింగ్స్‌ను, సినిమా రిలీజ్‌ల‌ను వాయిదా వేసుకున్నారు నిర్మాతలు. కానీ నభా నటిస్తోన్న ‘అల్లుడు అదుర్స్’ సినిమా షూటింగ్‌ను మాత్రం నిర్మాత‌లు వాయిదా వేయ‌లేద‌ట‌. దీనికి కారణం.. సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు ఈ సినిమా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి..నిర్మాత బెల్లంకొండ సురేష్ ‘అల్లుడు అదుర్స్’ యూనిట్‌తో మాట్లాడి సినిమా షూటింగ్‌ను కంటిన్యూ చేయాల‌ని కోరాడట. షూటింగ్‌లొ హీరోయిన్ పాల్గొనాలనీ అందులో భాగంగా బెంగ‌ళూరులో ఉన్న నభా నటేష్‌ను హైద‌రాబాద్‌కు పిలవ్వండంటూ చెప్పాడట. దీంతో కరోనా నుండి కాపాడుకుంటున్న నభా ఇండ‌స్ట్రీ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నాన‌ని తెలిసినా కూడా చక్కగా వచ్చి షూటింగ్‌ చేస్తుందని టాక్. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమంటే ఈ షెడ్యూల్‌లో తీయాల్సిన సీన్స్ తీయకపోతే మ‌ళ్లీ కాల్షీట్స్ స‌మ‌స్య వ‌స్తుంద‌ని సినిమా నిర్మాత‌ ఈ విధంగా చేస్తున్నాడట. కరోనా నుండి కాపాడుకోవాటికి త‌గు జాగ్ర‌త్త‌లు పాటిస్తూ షూటింగ్‌ను పూర్తి చేస్తోందట చిత్రబ‌ృందం.
Published by: Suresh Rachamalla
First published: March 17, 2020, 6:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading