తేజ్ కూరపాటి (Tej Kurapati) సోలో హీరోగా వెంకట్ వందెల (Venkat Vandela) దర్శకత్వంలో ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న సినిమా నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా (Naa Venta Paduthunna Chinnavadevadamma). ఈ సినిమాలో అఖిల ఆకర్షణ (Akhila Akarshana) హీరోయిన్ గా నటిస్తుండగా ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు కోదండ రామిరెడ్డి, దర్శకులు సాగర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్,గణేష్ మాస్టర్, యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి, పద్మిని నాగులపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్, సహారా గ్రూప్ యం. డి. తస్కిన్, ఉషారాణి తదితరులు హాజరయ్యారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సినిమా గురించి గొప్పగా చెప్పారు.
కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ.. అందరూ కొత్త వారితో తీసిన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ చాలా బాగున్నాయి .ఈ సినిమాకు నటీనటులు, టెక్నిసియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసినట్లనిపిస్తుంది. సినిమా కూడా బాగుంటుందనుకుంటున్నాను. మంచి కథతో వస్తున్న ఈ సినిమా నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.
ప్రముఖ దర్శకుడు సాగర్ మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్, టీజర్, పాటలు చూస్తుంటే సినిమా బాగుంటుంది అనే నమ్మకం కలిగింది. ప్రేక్షకులందరూ సెప్టెంబర్ 2 న థియేటర్ కు వచ్చి సినిమా చూసి అశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.
ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. టికెట్స్ రేట్స్ పెంచి నిర్మాతలు ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో వచ్చిన బింబిసార, సీతారామం, కార్తికేయ సినిమాలు ఇండస్ట్రీకి ఊపిరి నింపాయి. మళ్ళీ అలాంటి మంచి కంటెంట్ తో చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమా పెద్ద సినిమాగా మారేలా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలోని సాంగ్స్ చాలా బాగున్నాయి. మంచి ప్రేమకథను దర్శకుడు వెంకట్ సెలెక్ట్ చేసుకొన్నాడు. ఈ చిత్రానికి నిర్మాతలు కూడా చాలా కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్, నందమూరి హరికృష్ణ పుట్టినరోజైన సెప్టెంబర్ 2 న విడుదల చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tollywood, Tollywood actor, Tollywood Cinema