హోమ్ /వార్తలు /సినిమా /

బి. గోపాల్ చేతుల మీదుగా “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” ట్రైలర్ రిలీజ్

బి. గోపాల్ చేతుల మీదుగా “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” ట్రైలర్ రిలీజ్

Naa Venta Paduthunna Chinnadevadamma Trailer Photo News 18

Naa Venta Paduthunna Chinnadevadamma Trailer Photo News 18

Naa Venta Paduthunna Chinnadevadamma Trailer: తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”. సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా చిత్ర ట్రైలర్ ను దర్శకుడు బి. గోపాల్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై హుషారు లాంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” (Naa Venta Paduthunna Chinnadevadamma). ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా చిత్ర ట్రైలర్ ను దర్శకుడు బి. గోపాల్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు సాగర్ ప్రసన్న కుమార్, యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి, పద్మిని నాగులపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్, ఇండస్రిలిస్ట్ జానకిరామ్ తదితరులు
పాల్గొన్నారు.


ట్రైలర్ విడుదల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్, సాంగ్స్, ట్రైలర్ అన్ని బాగున్నాయి. ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిసియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ కథ పై ఉన్న నమ్మకంతో దర్శకుడు వెంకట్ చాలా కాన్ఫిడెంట్ గా తీశాడు. అలాగే ఈ సినిమా కథను, దర్శకుడిని నమ్మి తీసిన నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.


దర్శకుడు సాగర్ మాట్లాడుతూ..ఈ సినిమాలోని పాటలు బాగున్నాయి. సినిమా కూడా చాలా బాగుంటుంది. ప్రేక్షకులందరూ సెప్టెంబర్ 2 న థియేటర్ కు వచ్చి సినిమా చూసి అశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు


ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక రియాలిస్టిక్ ప్రేమకథను దర్శకుడు వెంకట్ చాలా బాగా డైరెక్షన్ చేశాడు.ఈ చిత్రానికి నిర్మాతలు కూడా చాలా కష్టపడ్డారు.ఫొటోగ్రఫీ చూస్తుంటే పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సెప్టెంబర్ 2 న వస్తున్న ఈ సినిమా టీం అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.' isDesktop="true" id="1418724" youtubeid="YD16cHbViJA" category="movies">


చిత్ర నిర్మాత ముల్లేటి క‌మ‌లాక్షి మాట్లాడుతూ.. ఇక్కడకు వచ్చిన దర్శకులు బి. గోపాల్, సాగర్, ప్రసన్న కుమార్, యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి, శశి ప్రీతమ్ లకు ధన్యవాదాలు..మా నాన్నకు హెల్త్ బాగా లేకపోయినా వెంకట్ చెప్పిన కథ నచ్చడతో నాతో ఈ సినిమా చేయించాడు. ఈ సినిమా ద్వారా నన్ను నిర్మాతగా పరిచయంచేసిన మా తల్లి తండ్రులు ముల్లేటి నాగేశ్వరావు, జానకి గార్లకు ధన్యవాదములు.ఈ చిత్రాన్ని ద్వారకా తిరుమలైన చిన్న తిరుపతిలో షూటింగ్ చేయడం జరిగింది. అనుకున్న టైమ్ కు, అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమా తీశాము.. మా చిత్ర దర్శకుడు వెంకట్ గారు ఈ కథను చాలా బాగా తెరకెక్కించాడు. అలాగే జి. వి. ఆర్,కృష్ణం రాజు లు కూడా సపోర్ట్ చేశారు ఇందులో నటించిన హీరో, హీరోయిన్ లకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతున్నాను. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


చిత్ర హీరోయిన్ అఖిల మాట్లాడుతూ..దర్శకుడు చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ఈ కథ లో హీరోయిన్ కు మంచి స్కోప్ ఉందనుకొని ఈ సినిమా చేశాను.సినిమా బాగా వచ్చింది. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు.


ఈ సినిమాలో తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ , త‌ణికెళ్ళ భ‌ర‌ణి, క‌ల్ప‌నా రెడ్డి, జీవా, జొగి బ్ర‌ద‌ర్స్‌, అనంత్‌, బ‌స్టాప్ కోటేశ్వ‌రావు, డాక్ట‌ర్ ప్ర‌సాద్‌, మాధ‌వి ప్ర‌సాద్‌, సునీత మ‌నోహ‌ర్ త‌దిత‌లురు నటించారు.

First published:

Tags: B.Gopal, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు