కరోనా బారిన పడిన నా పేరు మీనాక్షి సీరియల్ నటి..

కరోనా లాక్ డౌన్ అనంతరం తెలంగాణ ప్రభుత్వ సడలింపులతో వెండితెర, బుల్లితెర నటులు ఉత్సాహంగా షూటింగ్ లను ప్రారంభించారు.

news18-telugu
Updated: July 1, 2020, 1:20 PM IST
కరోనా బారిన పడిన నా పేరు మీనాక్షి సీరియల్ నటి..
నవ్య స్వామి Photo : Youtube
  • Share this:
కరోనా లాక్ డౌన్ అనంతరం తెలంగాణ ప్రభుత్వ సడలింపులతో వెండితెర, బుల్లితెర నటులు ఉత్సాహంగా షూటింగ్ లను ప్రారంభించారు. అయితే.. అంతా సజావుగా జరుగుతుందని అనుకుంటున్న తరుణంలో కరోనా తన పని తాను చేసుకుపోతోంది. ఈ క్రమంలో షూటింగ్స్ లో పాల్గొంటున్నవారు కరోనబారిన పడుతున్నారు. అందులో భాగంగా ఇటీవల ఇద్దరు టీవీ నటులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రభాకర్, హరికృష్ణలకుకరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. తాజాగా మరో టీవీ స్టార్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. 'నా పేరు మీనాక్షి', 'ఆమె కథ' వంటి పాపులర్ సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటిస్తోన్ననవ్య స్వామి అనే నటి కూడా వైరస్ బారిన పడ్డట్లుగా సమాచారం. కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతోన్న నవ్య.. వైరస్ నిర్థారణ పరీక్షకు వెళ్లగా, ఆమెకు పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె పాల్గొన్న షూటింగ్ టీం సభ్యులు అందరికీ కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారట. ఇక వరుసగా నటులకు కరోనా సోకడంతో ప్రస్తుతం షూటింగ్స్ అన్ని బంద్ కానున్నాయని సమాచారం.
First published: July 1, 2020, 1:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading