హోమ్ /వార్తలు /సినిమా /

Mythri Movie Makers: అప్‌డేట్ కావాలంటూ ఫ్యాన్స్ మెసేజ్‌లు.. బ్రహ్మానందం ఫొటోతో మైత్రీ మూవీ మేకర్స్ ఫన్నీ మీమ్

Mythri Movie Makers: అప్‌డేట్ కావాలంటూ ఫ్యాన్స్ మెసేజ్‌లు.. బ్రహ్మానందం ఫొటోతో మైత్రీ మూవీ మేకర్స్ ఫన్నీ మీమ్

బ్రహ్మానందం మీమ్

బ్రహ్మానందం మీమ్

మా హీరో సినిమా అప్‌డేట్ ఏంటి..? మా హీరో ఫ‌స్ట్ లుక్ ఎప్పుడు..? టీజ‌ర్ ఈ పండుగకు రిలీజ్ చేస్తారా..? అరే ఒక్క అప్‌డేట్ ఒక్క అప్‌డేట్ ఇవ్వండి స్వామి..? అని ఫ్యాన్స్ అడుగుతూనే ఉంటారు. ఇక ఒకానొక స‌మ‌యంలో అయితే స‌హ‌నం కోల్పోయి నిర్మాణ సంస్థ‌ల‌ను తిడుతూ కూడా వారు కామెంట్లు పెడుతుంటారు. ఇలా అన్నింటిని చూసిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్(Mythri Movie Makers) ఓ ఫ‌న్నీ మీమ్‌ని పెట్టింది.

ఇంకా చదవండి ...

  Mythri Movie Makers: త‌మ అభిమాన హీరోల సినిమాల గురించి గాసిప్‌లు వ‌చ్చిన‌ప్పుడే ఫ్యాన్స్‌లో సంద‌డి మొదలవుతుంది. అది కాస్త అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇక వారి సంతోషానికి అవ‌ధులు ఉండ‌వు. అప్ప‌టి నుంచి ఆ సినిమా అప్‌డేట్ గురించి తెలుసుకునేందుకు వారు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక మ‌ధ్య‌లో ఏదైనా పండుగ‌లు వ‌చ్చాయంటే.. త‌మ హీరోల సినిమా అప్‌డేట్ వ‌స్తుందేమోన‌ని ఆశ‌గా ఉంటారు. ఇక ఇప్పుడు సోష‌ల్ మీడియా విరివిగా వాడుతున్న నేప‌థ్యంలో.. ద‌ర్శ‌కుల‌కు, నిర్మాణ సంస్థ‌ల‌కు సోష‌ల్ మీడియాలో అభిమానులు మెసేజ్‌లు పెడుతుంటారు. మా హీరో సినిమా అప్‌డేట్ ఏంటి..? మా హీరో ఫ‌స్ట్ లుక్ ఎప్పుడు..? టీజ‌ర్ ఈ పండుగకు రిలీజ్ చేస్తారా..? అరే ఒక్క అప్‌డేట్ ఒక్క అప్‌డేట్ ఇవ్వండి స్వామి..? అని ఫ్యాన్స్ అడుగుతూనే ఉంటారు. ఇక ఒకానొక స‌మ‌యంలో అయితే స‌హ‌నం కోల్పోయి నిర్మాణ సంస్థ‌ల‌ను తిడుతూ కూడా వారు కామెంట్లు పెడుతుంటారు. ఇలా అన్నింటిని చూసిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఓ ఫ‌న్నీ మీమ్‌ని పెట్టింది.

  ఏ టైమ్‌లో రావాల్సిన అప్‌డేట్ ఆ టైమ్‌లో వ‌స్తాయి నాన్న అన్న కామెంట్‌తో.. స‌న్యాఫ్ స‌త్యమూర్తి సినిమాలోని బ్ర‌హ్మానందం ఫొటోను మైత్రీ మూవీ మేక‌ర్స్ పోస్ట్ చేశారు. అంతేకాదు దానికి థ్యాంక్యు గురువు గారు అని కామెంట్ పెట్టారు. సోష‌ల్ మీడియాలో ఈ పోస్ట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

  అయితే అన‌తికాలంలో పెద్ద నిర్మాణ సంస్థ‌గా గుర్తింపు సాధించుకున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌వ‌న్ క‌ల్యాణ్- హ‌రీష్ శంక‌ర్ సినిమా, అల్లు అర్జున్-సుకుమార్ పుష్ప , మ‌హేష్ బాబు-ప‌ర‌శురామ్ స‌ర్కారు వారి పాట‌, నాని అంటే సుంద‌రానికి సినిమాల‌ను నిర్మిస్తోంది. ఇక వైష్ణ‌వ్ తేజ్‌తో వీరు నిర్మించిన ఉప్పెన విడుద‌లకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ టీజ‌ర్ ఇవాళ విడుద‌ల కానుంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Mythri Movie Makers

  ఉత్తమ కథలు