Uppena Buchi Babu Sana: కారు కావాలా..? ఇల్లు కావాలా..? ‘ఉప్పెన’ దర్శకుడికి నిర్మాతల బంపర్ ఆఫర్..

బుచ్చి బాబు సన (Buchi Babu Sana)

Uppena Buchi Babu Sana: ఇండస్ట్రీలో దర్శకులకు కానుకలు ఇవ్వడం ఇప్పుడే తొలిసారి కాదు. తమకు అదిరిపోయే విజయం అందించిన ప్రతీసారి కూడా వాళ్లను గుర్తు పెట్టుకుని మంచి బహుమతులు ఇస్తుంటారు నిర్మాతలు, హీరోలు.

  • Share this:
ఇండస్ట్రీలో దర్శకులకు కానుకలు ఇవ్వడం ఇప్పుడే తొలిసారి కాదు. తమకు అదిరిపోయే విజయం అందించిన ప్రతీసారి కూడా వాళ్లను గుర్తు పెట్టుకుని మంచి బహుమతులు ఇస్తుంటారు నిర్మాతలు, హీరోలు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలు తమ దర్శకులకు ఎప్పటికప్పుడు మంచి గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా ఉప్పెన సినిమాతో సంచలన విజయం అందించిన బుచ్చిబాబుకు నిర్మాతల నుంచి ఊహించని ఆఫర్ వచ్చింది. వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఈయన తెరకెక్కించిన ఉప్పెన ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ దాటి 60 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. కేవలం మూడు రోజుల్లోనే బయ్యర్లందర్నీ లాభాల బాట పట్టించిన ఉప్పెన.. 5 రోజుల్లోనే 35 కోట్ల షేర్ వసూలు చేసి అద్భుతాలు చేస్తుంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో మరే హీరోకు సాధ్యం కాని రేంజ్‌లో డెబ్యూ సినిమాతో సంచలన రికార్డులు తిరగరాస్తున్నాడు వైష్ణవ్ తేజ్. సినిమాలో దమ్ముంది.. అందుకే ఆడుతుంది అంటూ నిర్మాతలు చెప్తున్నారు. అయితే కంటెంట్ యావరేజ్‌గానే ఉన్నా కాలేజ్ పిల్లలు కనెక్ట్ అవ్వడంతోనే ఈ విజయం సాధ్యం అయిందంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా కూడా ఉప్పెన మాత్రం ఓ సంచలనం. ఈ సినిమా వసూళ్లు ఊహకందని అద్భుతం. కలలో కూడా వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు.
uppena movie,uppena movie director,uppena movie director buchi babu sana,uppena movie mythri movie makers,uppena movie collections,costly gift to uppena movie director buchi babu sana,ఉప్పెన,ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సన,బుచ్చిబాబుకు మైత్రి మూవీ మేకర్స్ ఖరీదైన బహుమతి
ఉప్పెన సినిమా కలెక్షన్స్ (Uppena movie collections)

ఇదిలా ఉంటే ఇంతటి విజయం అందించిన దర్శకుడు బుచ్చిబాబుకు ఇప్పుడు మైత్రి నిర్మాతల నుంచి అంతే అద్భుతమైన బహుమతి వేచి చూస్తుందని తెలుస్తుంది. ఈయనకు అక్కడ్నుంచి ఆఫర్ వచ్చిందని.. ఇల్లు కావాలా.. కారు కావాలా నీ యిష్టం.. ఏది కావాలంటే అది తీసుకో అని అక్కడ్నుంచి ఓ పిలుపు వచ్చినట్లు చెప్పాడు ఈయన. అది చెప్తూనే ఎమోషనల్ అయిపోయాడు బుచ్చిబాబు సన. 20 కోట్ల బిజినెస్ చేసిన ఉప్పెనకు ఇప్పటికే 20 కోట్ల లాభాలు వచ్చాయి.
uppena movie,uppena movie director,uppena movie director buchi babu sana,uppena movie mythri movie makers,uppena movie collections,costly gift to uppena movie director buchi babu sana,ఉప్పెన,ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సన,బుచ్చిబాబుకు మైత్రి మూవీ మేకర్స్ ఖరీదైన బహుమతి
బుచ్చాబాబు సన ఉప్పెన (Buchi Babu Sana Uppena)

ఇంకా ఫుల్ రన్ అయ్యేసరికి కచ్చితంగా మరో 20 కోట్లు వచ్చేలా కనిపిస్తుంది. ఆ లెక్కన ఉప్పెన నిర్మాతలకు లాభాల ఉప్పెన తీసుకొచ్చినట్లే. ప్రస్తుతం జోరు చూస్తుంటే 50 కోట్ల క్లబ్బులో చేరిపోయేలా కనిపిస్తుంది ఉప్పెన. మరి ఆ రేంజ్ సక్సెస్ ఇచ్చిన దర్శకుడికి ఈ స్థాయిలో బహుమతి రావడం కూడా సమంజసమే కదా.
Published by:Praveen Kumar Vadla
First published: