తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాలు ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. కొన్ని సినిమాలు కల్ట్ మూవీస్‌గా నిలిచిపోతాయి. అలా కల్ట్ మూవీగా ప్రేక్షకులను మెప్పించిన రీసెంట్ సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి’ ఒకటి. ఈ సినిమాకు ముందు విజయ్ దేవరకొండ జస్ట్ హీరో మాత్రమే. కానీ ఈ సినిమా రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ స్టార్‌గా మారిపోయాడు. సినిమా క్రెడిట్ హీరోకు మాత్రమే దక్కలేదు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు కూడా అదే రేంజ్లో క్రేజ్‌ను దక్కించుకున్నాడు. అదే ఊపుతో అర్జున్ రెడ్డిని బాలీవుడ్లో ‘కబీర్‌సింగ్’పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఇప్పుడు ఏకంగా రణ్‌భీర్ కపూర్‌తో యానిమల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తర్వాత ఎందుకనో సందీప్ వంగా, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమా రానే లేదు.
అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు మరోసారి విజయ్ దేవరకొండ, సందీప్ వంగా కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం తెలుగులో భారీ సినిమాలను నిర్మిస్తోన్న సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. ప్రస్తుతం ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందట. అంతా ఓకే అయిన తర్వాత ప్రాజెక్ట్‌కు సంబంధించిన సమాచారం వెలువడుతుందని టాక్.
సందీప్ వంగా..రణ్‌భీర్ కపూర్‌తో ఎనిమల్ సినిమా చేసిన తర్వాత ఈ స్క్రిప్ట్‌పై వర్క్ చేయాల్సి ఉంటుంది. మరో వైపు విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్‌తో సినిమాను చేయాల్సి ఉంది. దాని తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేస్తాడు. అది పూర్తయ్యాకే సందీప్ వంగా సినిమా ట్రాక్ ఎక్కుతుందంటున్నారు మరి. ఎలాగూ సందీప్ వంగాకి బాలీవుడ్‌లోనూ గుర్తింపు వచ్చింది. విజయ్ దేవరకొండ లైగర్‌తో ఎలాగూ ప్యాన్ ఇండియా హీరోగా పరిచయం అవుతాడు కాబట్టి అర్జున్ రెడ్డి కాంబో నెక్ట్స్ మూవీ ప్యాన్ ఇండియా రేంజ్‌లోనే తెరకెక్కుతుందనడంలో సందేహం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.