Allu Arjun - Pushpa - Fahad Fasil: ‘పుష్ప‌’లో విల‌న్ ఫిక్స్‌.. ఎవ‌రూ ఊహించని పేరుని ప్ర‌క‌టించిన మైత్రీ మూవీ మేక‌ర్స్

Mythri movie makers announced Fahad Fasil name as Villain in Allu arjun Pushpa

Allu Arjun - Pushpa - Fahad Fasil: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీలో విలన్‌గా పహద్ ఫాజిద్ నటించనున్నట్లు తెలియజేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

  • Share this:
    ఎట్టకేలకు బన్నీ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప విష‌యంలో మ‌రో క్లారిటీ ఇచ్చేసింది చిత్ర యూనిట్‌. ఇంత‌కీ చిత్ర యూనిట్ ఇచ్చిన క్లారిటీ ఏంటో తెలుసా? విల‌న్ గురించి. నెట్టింట గ‌త కొన్ని రోజులుగా పుష్ప సినిమాలో విల‌న్‌గా ఎవ‌రు న‌టిస్తారు? అనే దానిపై చాలా పెద్ద చ‌ర్చే జ‌రిగింది. దీనికి క్లారిటీ ఇస్తూ నిర్మాత‌లు మ‌ల‌యాళ ప్ర‌ముఖ న‌టుడు ప‌హద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నాడంటూ ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రిచారు. దీనికి సంబంధించి చిన్న ప్రోమోను కూడా విడుద‌ల చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌.

    నిజానికి ఈ సినిమాలో ముందుగా మెయిన్ విల‌న్‌గా కోలీవుడ్ న‌టుడు విజ‌య్ సేతుప‌తి పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. అయితే మ‌ధ్యలో రెమ్యున‌రేష‌న్‌, డేట్స్ అడ్జ‌స్ట్ కాక‌పోవ‌డం వంటి కారణాల‌తో విజ‌య్ సేతుప‌తి డ్రాప్ అయిన‌ట్లు వార్త‌లు కూడా వినిపించాయి. ఈ మ‌ధ్య మ‌రోసారి విజ‌య్ సేతుప‌తి పేరు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. అయితే ఈ వార్త‌ల‌న్నింటికీ చెక్ పెడుతూ పుష్ప టీమ్ .. ఎవ‌రూ ఊహించ‌ని పేరు ప‌హ‌ద్ ఫాజిల్ పేరుని అనౌన్స్ చేయ‌డం విశేషం.



    సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా శేషా‌చ‌ల అడ‌వుల్లో మాత్రమే దొరికే ఎర్ర‌చంద‌నం, దానికి సంబంధించిన స్మ‌గ్లింగ్‌పై ‘రూపొందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్‌ను కేర‌ళ‌, మారేడు మిల్లి, రంప‌చోడ‌వ‌రంలోని అట‌వీ ప్రాంతాల్లో చిత్రీక‌రించారు. ఇప్పుడు తెన్‌కాశీలో చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఆగ‌స్ట్ 13న తెలుగు, త‌మిళ, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
    Published by:Anil
    First published: