హోమ్ /వార్తలు /సినిమా /

అది ఎప్పటికీ మరిచిపోను.. సుడిగాలి సుధీర్ ఆసక్తికర కామెంట్స్..

అది ఎప్పటికీ మరిచిపోను.. సుడిగాలి సుధీర్ ఆసక్తికర కామెంట్స్..

జబర్దస్త్ అనే టీవీ షో వల్లే తనకు గుర్తింపు వచ్చిందని.. సినిమాల్లో బిజీ అయినా సరే అందులో నటిస్తూనే ఉంటానని చెప్పాడు.

    సుడిగాలి సుధీర్-ధన్యా బాలకృష్ణన్ హీరో హీరోయిన్లుగా నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుధీర్ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.ఇందులో భాగంగా తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుల్లితెర,వెండితెరల్లో దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారని ప్రశ్నించగా.. బుల్లితెరకే తన మొదటి ప్రాధాన్యం అన్నారు. తన మూలాలు అక్కడే ఉన్నాయని, అక్కడినుంచే ఎదిగొచ్చానని, కాబట్టి ఆ విషయం ఎప్పటికీ మరిచిపోనని అన్నాడు. జబర్దస్త్ అనే టీవీ షో వల్లే తనకు గుర్తింపు వచ్చిందని.. సినిమాల్లో బిజీ అయినా సరే అందులో నటిస్తూనే ఉంటానని చెప్పాడు. ఇక ఢీ,జబర్దస్త్,సినిమాలు.. ఈ మూడింట్లో ఏది ఎక్కువ ఇష్టమని ప్రశ్నించగా.. మరో ఆలోచన లేకుండా జబర్దస్త్ అని చెప్పేశాడు సుధీర్.

    కాగా,శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ పారిశ్రామికవేత్త కె.శేఖర్‌ రాజు నిర్మాణంలో, రాజశేఖర్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.సీనియర్ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి తదితరులు ఇందులో ముఖ్య పాత్రల్లో నటించారు.

    First published:

    Tags: Jabardasth, Sudigali sudheer

    ఉత్తమ కథలు