భూమిపై ఇదే నా పేవరేట్ ప్లేస్... మహేష్ బాబు ట్వీట్

మహేశ్‌ అక్కడి స్విస్‌ ఆల్ప్స్‌ దగ్గర తీసుకున్న ఫొటోను శనివారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కుటుంబంతో కలిసి దిగిన సెల్ఫీని షేర్‌ చేశారు.

news18-telugu
Updated: October 6, 2019, 9:10 AM IST
భూమిపై ఇదే నా పేవరేట్ ప్లేస్... మహేష్ బాబు ట్వీట్
మహేష్ బాబు ఫైల్ ఫోటో
  • Share this:
దసరా సెలవుల్ని టాలీవుడ్ ప్రిన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. స్విట్జర్లాండ్‌లో మహేష్ ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోల్ని మహేష్ సోషల్ మీడియాలో తన అభిమానులకు షేర్ చేశారు. ‘భూమిపై నాకు ఇష్టమైన ప్రాంతం స్విస్ ఆల్ప్స్. దసరా సందర్భంగా వచ్చిన షార్ట్ బ్రేక్‌ను ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నా. రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తా’అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. దసరా సెలవుల సందర్భంగా పిల్లలు గౌతమ్‌, సితార, భార్య నమ్రతతో కలిసి మహేష్ స్విట్జర్లాండ్‌ వెళ్లారు. స్విట్జర్లాండ్‌కు వెళ్లిన తర్వాత మహేశ్‌ అక్కడి స్విస్‌ ఆల్ప్స్‌ దగ్గర తీసుకున్న ఫొటోను శనివారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కుటుంబంతో కలిసి దిగిన సెల్ఫీని షేర్‌ చేశారు.
స్విట్జర్లాండ్‌లో ఫ్యామిలీతో మహేష్ బాబు సెల్ఫీ

ప్రస్తుతం మహేష్ బాబు ‘సరిలేరు నీకెవవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని అభిమానుల ముందుకు తీసుకురానున్నారు.
First published: October 6, 2019, 9:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading