Home /News /movies /

MUTTIAH MURALITHARAN BIOPIC 800 MOVIE MOTION POSTER RELEASED AND VIJAY SETHUPATHI CREATED MAGIC PK

Muttiah Muralitharan motion poster: విజయ్ సేతుపతి సేమ్ టూ సేమ్ మురళీని దించేసాడుగా..

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ (800 movie vijay sethupathi)

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ (800 movie vijay sethupathi)

Muttiah Muralitharan motion poster: తెలుగు ఇండస్ట్రీలోనే కాదు అన్ని భాషల్లోనూ ఇప్పుడు బయోపిక్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. మరీ ముఖ్యంగా క్రీడాకారుల జీవితకథలకు కూడా బాగానే క్రేజ్ ఉంది. ఇప్పటికే ఇండియన్ క్రికెట్ నుంచి అజార్, సచిన్, ధోనీ బయోపిక్స్..

ఇంకా చదవండి ...
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు అన్ని భాషల్లోనూ ఇప్పుడు బయోపిక్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. మరీ ముఖ్యంగా క్రీడాకారుల జీవితకథలకు కూడా బాగానే క్రేజ్ ఉంది. ఇప్పటికే ఇండియన్ క్రికెట్ నుంచి అజార్, సచిన్, ధోనీ బయోపిక్స్ వచ్చేసాయి. ఇప్పుడు 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కబీర్ ఖాన్ తెరకెక్కించిన 83 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఓ విధంగా కపిల్ దేవ్ బయోపిక్. ఇప్పుడు మరో క్రికెటర్ బయోపిక్ కూడా వచ్చేస్తుంది. అయితే మన క్రికెటర్ కాదు.. శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్. టెస్టుల్లో ఈయన తీసిన వరల్డ్ రికార్డు 800 వికెట్లకు గుర్తుగా టైటిల్ కూడా ఇదే పెట్టారు. శ్రీలంక బౌలర్ అయినా కూడా ఈయన మూలాలు మాత్రం తమిళనాడులోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి శరణార్థులుగా లంకకు వెళ్లిపోయారు ముత్తయ్య కుటుంబం. చిన్ననాటి నుంచి అక్కడే ఉన్నాడు. అయినా కూడా తమిళులు అంటే ముత్తయ్య మురళీధరన్‌కు ఎనలేని అనుబంధం. అందుకే 2005లో తమిళ అమ్మాయి మదిమలార్ రామమూర్తిని పెళ్లి చేసుకున్నాడు ముత్తయ్య.
ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ (800 movie vijay sethupathi)
ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ (800 movie vijay sethupathi)

టెస్టుల్లో 800, వన్డేల్లో 534, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1,374, లిస్టు ఏ క్రికెట్‌లో 682 వికెట్లు తీసి ఐసిసి హాల్ ఆఫ్ క్రికెటర్స్‌లో చోటు దక్కించుకున్నాడు మురళీ. ఈయనకు దేశంతో సంబంధం లేకుండా అభిమానులున్నారు. అయితే ఈయన క్రికెట్ జీవితంలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. చిన్నపుడు ఈయన కుటుంబంలో జరిగిన విషాదాలు.. దాడులు కూడా ఈ సినిమాలో చూపిస్తున్నాడు దర్శకుడు ఎమ్మెస్ శ్రీపతి. ఇక ముత్తయ్య పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఆయన్ని పూర్తిగా మురళీగా మార్చేసారు దర్శక నిర్మాతలు.

మురళీధరన్ బాల్యంలో ఎదుర్కొన్న సమస్యలతో పాటు క్రికెట్ కోసం పడిన శ్రమ.. ఆ తర్వాత కెరీర్ మొదలు పెట్టిన తర్వాత ఐసిసి బౌలింగ్ చెక్ ఇవన్నీ కూడా సినిమాలో ప్రధానం చూపించబోతున్నారు. మోషన్ పోస్టర్‌లోనూ ఇదే హైలైట్ చేసాడు దర్శకుడు శ్రీపతి. ప్రస్తుతం శ్రీలంక బౌలింగ్ కోచ్‌గా ఉన్న మురళీధరన్.. ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. మరి ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Kollywood, Tamil Cinema, Vijay Sethupathi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు