హోమ్ /వార్తలు /సినిమా /

బాలు.. గంధర్వుల కోసం పాడతావా.. మాట వినకుండా వెళ్లిపోయావ్.. ఇళయరాజా ఎమోషనల్..

బాలు.. గంధర్వుల కోసం పాడతావా.. మాట వినకుండా వెళ్లిపోయావ్.. ఇళయరాజా ఎమోషనల్..

ఇళయరాజా బాలసుబ్రమణ్యం (ilaiyaraaja balasubrahmanyam)

ఇళయరాజా బాలసుబ్రమణ్యం (ilaiyaraaja balasubrahmanyam)

Ilaiyaraaja Balasubrahmanyam: ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా.. ఎంతమంది గాయకులు ఉన్నా కూడా ఆ ఇద్దరు కలిస్తే మాత్రం చరిత్రే. ఆ కాంబినేషన్ దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత అరుదైన.. గొప్ప కాంబినేషన్. వాళ్లే ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం.

ఇంకా చదవండి ...

ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా.. ఎంతమంది గాయకులు ఉన్నా కూడా ఆ ఇద్దరు కలిస్తే మాత్రం చరిత్రే. ఆ కాంబినేషన్ దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత అరుదైన.. గొప్ప కాంబినేషన్. వాళ్లే ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఎన్నో వేల పాటలు వచ్చాయి. ఇప్పుడు ఈ జంటలో ఒకరు వెళ్లిపోయారు. దాంతో ఇళయరాజా చాలా ఎమోషనల్ అయ్యాడు. నువ్వు లేని లోకంలో నాకు అంతా చీకటి ఉండిపోయింది అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. బాలు ఎక్కడికి వెళ్లిపోయావ్.. త్వరగా కోలుకొని రమ్మని చెప్పాను.. కానీ నువ్వు నా మాట వినలేదు.. వెళ్లిపోయావ్.. ఎక్కడికి వెళ్లావ్.. అక్కడ గంధర్వుల కోసం పాడటానికి వెళ్లావా అంటూ ఎమోషనల్ అయ్యాడు. నువ్వు లేని ఈ ప్రపంచం చీకటి అయిపోయింది. నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాడం కావడం లేదు. దేనికైనా ఓ హద్దు ఉంటుంది.. కానీ దీనికి హద్దు లేదంటూ బాలుతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నాడు మ్యాస్ట్రో.


ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వేల పాటలు శ్రోతలను అలరించాయి. మధ్యలో ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చినా కూడా మళ్లీ కలిసిపోయారు. ఇప్పుడు బాలు వెళ్లిపోవడంతో కన్నీరు పెట్టుకుంటున్నాడు మ్యూజికల్ మ్యాస్ట్రో.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ilaiyaraaja, SP Balasubrahmanyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు