SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణానికి ఆ సర్జరీ ప్రధాన కారణం అయిందా..?

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు బాలు లేడనే వార్త కూడా నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే ఆయన పాట లేని సంగీత ప్రపంచాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 25, 2020, 2:44 PM IST
SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణానికి ఆ సర్జరీ ప్రధాన కారణం అయిందా..?
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)
  • Share this:
ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు బాలు లేడనే వార్త కూడా నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే ఆయన పాట లేని సంగీత ప్రపంచాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. పైగా ఎప్పుడూ కెమెరా ముందు చిరునవ్వుతో కనిపించే బాలు ఇలా ఉన్నట్లుండి దూరమైపోవడం తట్టుకోలేకపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు ఇది నిజంగానే కఠోరమైన వార్త. ఊహించలేని పరిణామం. కోట్లాది మంది అభిమానులు బాలు లేడనే వార్త తెలుసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. అయితే రెండు నెలల కింది వరకు ఆరోగ్యంగా కనిపించిన ఈయన ఇలా అయిపోవడానికి కారణమేంటి అనేది కూడా చాలా మందికి అర్థం కావడం లేదు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)


కరోనా వచ్చినంత మాత్రానా చనిపోయాడా అంటూ ఆలోచనలో పడిపోయారు. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్ వచ్చినా కూడా కంగారు పడకుండా.. ఇంట్లోనే రెండు వారాలు ఉండి నయం చేసుకుంటున్నారు. రికవరీ రేటు కూడా 80 శాతానికి పైగానే ఉంది. చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆస్పత్రికి వెళ్లి నయం చేసుకుంటున్నారు. అందులో కొందరి పరిస్థితి మాత్రమే విషమిస్తుంది.. ప్రాణాలు పోతున్నాయి. ఒంట్లో ఇతర వ్యాధులు ఉండి.. ఇమ్యూనిటి పవర్ తక్కువగా ఉన్న వాళ్లను మాత్రమే కరోనా అటాక్ చేస్తుంది.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)


అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎప్పుడూ హాస్పిటల్ మెట్లు ఎక్కినట్లు కానీ.. ఆయన ఆరోగ్యం దెబ్బ తిన్నట్లు కానీ ఎక్కడా చదవలేదు.. రాలేదు కూడా. అయినా కూడా ఇప్పుడు కరోనాతో నెల రోజులు పోరాడి గెలిచాడు ఈయన. నెగిటివ్ వచ్చిన తర్వాత బాలసుబ్రమణ్యం మరణించాడు. దాదాపు 44 రోజులు చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో వెంటిలేటర్‌పైనే ఉన్నాడు బాలు. కేవలం వయసు భారమే అనుకున్నా కూడా చాలా మంది బయటపడుతున్నారు. కానీ బాలు పరిస్థితి అది కాదు.. ఆయన పరిస్థితి విషమించడానికి ప్రత్యేక కారణం ఒకటి ఉంది.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)


గతేడాది ఆయన చేయించుకున్న బేరియాట్రిక్ సర్జరీ. అంటే బరువు తగ్గడం కోసం చేసే ఓ ఆపరేషన్ అన్నమాట. వయసు పెరిగిపోతుండటంతో బరువు తగ్గకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని భావించిన బాలు.. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే కాస్త బరువు కూడా తగ్గి ఉత్సాహంగా మారిపోయాడు. ఇలా ఆయన్ని చూసిన వాళ్లంతా కూడా ఏమైందని అడిగితే.. నాకేంటి బాగానే ఉన్నాను.. లావుగా ఉన్నపుడు ఎవరూ అడగరు కానీ సన్నగా అయితే అడుగుతారా అంటూ కామెడీ కూడా చేసాడు. అలాంటి బాలు ఇలా అందరికీ దూరమైపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)


బేరియాట్రిక్ సర్జరీ కారణంగా బాలు ఒంట్లో కొన్ని అవయవాలు బలహీన పడ్డాయని.. దాంతో కరోనా వైరస్ అటాక్ చేసేసరికి అది కాస్తా విషమ పరిస్థితికి వచ్చేసిందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తుంది. ఈయన మరణానికి మరో ప్రధాన కారణం ఇది కూడా అయ్యుండొచ్చని వార్తలు వస్తున్నాయి. మామూలుగా అయితే అసలు అది ఇబ్బందికరం కాదని.. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలు వయసుతో పాటు సర్జరీ తాలూకు ప్రభావంతో కరోనా తీవ్రమైందని తెలుస్తుంది. అందుకే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఏదేమైనా కూడా బాలు ఇంక మనకు లేడు.. ఆయన గాత్రం మాత్రమే మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.
Published by: Praveen Kumar Vadla
First published: September 25, 2020, 2:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading