ఎన్నో సినిమాలకు తన సంగీతంతో విజయ తీరాలకు చేర్చిన ఇళయరాజా.. గత కొన్ని రోజులుగా తన మ్యూజిక్ కంటే వివాదాలతోనే సహవాసం చేస్తున్నడనే చెప్పాలి. ఇప్పటికే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటలు పాడుతూ తనకు రాయల్టీ చెల్లించడం లేదంటూ కోర్డు కెక్కిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత ఈ వివాదాం సద్దు మణిగిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఇళయరాజా.. ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్ పై పోలీసులకు కంప్లైంట్ చేసాడు. గత కొన్నేళ్లుగా ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్ మధ్య ఓ స్టూడియో విషయమై వివాదం నడుస్తూనే ఉంది. తాజాగా ఎల్వీ ప్రసాద్ మనవడుు ఇళయరాజాను బెదిరించడంతో పాటు ప్రసాద్ స్టూడియోలో ఉన్న ఇళయరాజా సూట్‌లో ఉన్న సంగీత వాయిద్య పరికరాలను ధ్వంసం చేసారని చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఇళయరాజా ఫిర్యాదు చేశారు.
గత కొన్నేళ్లుగా ప్రసాద్ స్టూడియోలో ఉన్న ఇళయరాజా సూట్ విషయమై ఇళయరాజాకు ప్రసాద్ స్టూడియోస్ అధినేత సాయి ప్రసాద్ మధ్య ఓ కేసు నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కోర్టులో కేసు నడుస్తూ ఉండగానే సాయి ప్రసాద్ మనుషులు తన స్టూడియోను ఖాళీ చేసేలా దౌర్జన్యం చేసారని ఇళయరాజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు తన పనికి అడ్డొస్తోన్న వారినపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ప్రసాద్ స్టూడియోలోని ఇళయరాజాకు ఉన్న సూట్‌ను అప్పట్లో ఎల్వీ ప్రసాద్.. ఆయన సంగీతానికి ముగ్దుడై ఓ సూట్‌ను ఆయనకు బహుమానంగా ఇచ్చారు. అప్పటి నుంచి ఇళయరాజా అక్కడే తన సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక అప్పట్లో ఎల్వీ ప్రసాద్... ఇళయరాజాకు ఇచ్చిన ఈ బహుమతిని నోటి మాటగా ఇచ్చారు. దీనిపై ఎలాంటి రాత కోతలు లేవు. ఇదే అదునుగా భావించి ఇపుడు ఎల్వీ ప్రసాద్ మనవడు తన తాత ఇళయరాజాకు ఇచ్చిన స్టూడియోను ఆయన నుంచి స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ilaiyaraaja, Kollywood, Tollywood