Home /News /movies /

MUSIC DIRECTOR THAMAN SHARES JUKE BOX OF PAWAN KALYAN BHEEMLA NAYAK GETS GOOD RESPONSE SR

Pawan Kalyan | Bheemla Nayak : పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ నుంచి ఫ్యాన్స్‌కు మరో ట్రీట్..

భీమ్లా నాయక్ Photo : Twitter

భీమ్లా నాయక్ Photo : Twitter

Pawan Kalyan | Bheemla Nayak : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ  ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak). ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఇంకా చదవండి ...
    Pawan Kalyan | Bheemla Nayak : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్’ (Bheemla Nayak). ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లోను మంచి కలెక్షన్స్ దక్కించుకుంది. భీమ్లానాయక్ (Bheemla Nayak) ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్స్‌కు పైగా కలెక్షన్స్ సాధించిందని అదరగొట్టింది. ఇప్పటికే అక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యి.. లాభాల బాటలో ఉందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్‌కు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలకు సంబంధించిన (Bheemla Nayak Juke Box) జూక్ బాక్స్‌ను టీమ్ యూట్యూబ్‌లో వదిలింది. దీనికి సంబంధించి ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ ఓ ట్వీట్ చేస్తూ జూక్ బాక్స్‌ను పంచుకున్నారు.

    ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను డిస్నీ హాట్ స్టార్‌తో పాటు ఆహా కూడా భారీ ధరకు దక్కించుకుంది. అంతేకాదు ఈ సినిమా మార్చి 25న ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఇక ఈ సినిమా తెలుగుతో పాటుగా హిందీలో కూడా ఏకకాలంలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేసింది టీమ్. అయితే కొన్ని కారణాల వలన అక్కడ విడుదలకాలేదు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ డబ్బున్న మాజీ సైనికాధికారి అహానికి.. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ. పవన్ కళ్యాణ్, రానాలకు హీరోయిన్స్‌గా నిత్య మీనన్, (Nithya menen) సంయుక్త మీనన్ (Samyuktha Menon)‌లు నటించారు.  రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం అందించారు.




    ఇక ఆ సినిమాతో పాటు (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ  సినిమాను చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) అనే సినిమాను ఖరారు చేశారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bheemla Nayak, Pawan kalyan, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు