Music Director Thaman: తమన్ నువ్వు చేసిన పని తెలిస్తే.. మీ అమ్మ కడుపు నిండా అన్నం పెడుతుందిపో..!

థమన్ (Thaman)

Music Director Thaman: కరోనాతో చాలా మంది సినీ ప్రముఖులు వరసగా కన్ను మూస్తున్నారు. ఈ మధ్యే ఓ కీ బోర్డ్ ప్లేయర్ కూడా ఇలాగే మరణించారు. ఆయన పేరు కమల్ కుమార్. ఈయన కుటుంబానికి ఇప్పుడు తమన్ (Thaman) ఊహించని సాయం చేస్తున్నారు. దాంతో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా తమన్ పేరు చెప్పాలేమో..? ఎందుకంటే ఏడాదికి 10 సినిమాలకు పైగానే చేస్తూ.. అందులో కనీసం 5 సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇస్తున్నాడు ఈయన. కొన్ని సినిమాలు అయితే కేవలం తమన్ సంగీతంతోనే హిట్ అవుతున్నాయంటే అతిశయోక్తి లేదేమో..? సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమాలో తమన్ అందించిన సంగీతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రతీ సినిమాకు ప్రాణం పెడుతున్నారు ఈయన. ఇదిలా ఉంటే సినిమాలు మాత్రమే కాదు.. సాయం చేయడంలోనూ తనకు తానే సాటి అనిపించుకుంటున్నారు తమన్. తాజాగా ఈయన చేసిన ఓ సాయం చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కరోనాతో చాలా మంది సినీ ప్రముఖులు వరసగా కన్ను మూస్తున్నారు. ఈ మధ్యే ఓ కీ బోర్డ్ ప్లేయర్ కూడా ఇలాగే మరణించారు. ఆయన పేరు కమల్ కుమార్. తమన్ సహా చాలా మంది సంగీత దర్శకుల దగ్గర కీ బోర్డ్ ప్లేయర్‌గా పని చేసిన అనుభవం ఆయన సొంతం. కొన్ని రోజుల కింద ఈయన కరోనా బారిన పడ్డారు.

పరిస్థితి విషమించడంతో రెండు రోజుల కింద చనిపోయారు. అయితే ఆయన మరణించిన విషయం తెలుసుకుని ఇప్పటికే కొందరు ఆర్థిక సాయం అందించారు. కమల్ కుమార్‌ది మరీ పేద కుటుంబం కావడంతో తమన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

thaman,thaman twitter,thaman instagram,thaman movies,thaman helps,thaman help key board player kamal kumar,key board player kamal kumar passed away,తమన్,తమన్ సాయం,తమన్ కీ బోర్డ్ ప్లేయర్ కమల్ కుమార్ మరణం
తమన్ మ్యూజిక్ డైరెక్టర్ (Twitter/Photo)


తన కుటుంబానికి అండగా ఉంటూనే.. కమల్ కొడుకు చదివించే బాధ్యతను ఈయన తీసుకున్నారని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి తమన్ అభిమానులు సంతోషపడుతున్నారు. ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో దీనిపై మీమ్స్ కూడా వస్తున్నాయి. నువ్వు చేసిన మంచి పని తెలిస్తే మీ అమ్మ నీకు కడుపు నిండా అన్నం పెడుతుందన్నా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా తమన్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తుందిప్పుడు.
Published by:Praveen Kumar Vadla
First published: