Home /News /movies /

MUSIC DIRECTOR RAGHU KUNCHE ABOUT COPY MUSIC IN MOVIES SB

కాపీ కొట్టిన పాటలే హిట్ అవుతున్నాయి... ఓ మ్యూజిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ట్రోల్‌లో కాపీ అని తేలితే ఆ పాటే హిట్ సాంగ్ అయిపోతుందని చెప్పారు. అందుకు కాసేపు నెటిజన్లు అన్నమాటలు మాత్రం భరించాల్సి ఉంటుందన్నారు.

    ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నెటిజన్స్ చాలా స్మార్ట్ అయిపోయారు. ఏదైనా కొత్త పాట వస్తే చాలు దాన్ని వెంటనే వినడం నుంచి... ఆ పాటకు మూలాలు ఎక్కడ ఉన్నాయా? అని వెతకడం వరకు చాలా బిజీగా అయిపోతున్నారు. కొత్త పాటకు, పాత పాటకు మధ్య ఏమాత్రం మ్యూజిక్ కలిసినా కాపీ అంటూ వాటిపై ముద్ర వేసేస్తున్నారు.ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని కొత్త పాటల విషయంలో చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. అయినప్పటికీ కూడా ఆ పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ విషయంపై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో కాపీ కొట్టిన పాటలే సూపర్ హిట్ అవుతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ట్రోల్‌లో కాపీ అని తేలితే ఆ పాటే హిట్ సాంగ్ అయిపోతుందని చెప్పారు. కాసేపు నెటిజన్లు అన్నమాటలు మాత్రం భరించాల్సి ఉంటుందన్నారు. ట్రోలింగ్‌ను పట్టించుకోకుండా ఎవరేం అనుకుంటే నాకేం అన్న భావన ఉంటే పర్వాలేదన్నారు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఇలాంటి ట్రోల్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారన్నారు. తనపై ట్రోల్స్ చేస్తున్నారంటూ ఆ విషయాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిపారు రఘు కుంచె. మొత్తం మీద కాపీ ట్యూన్స్‌పై రఘు కుంచె చేసిన ఈ కీలక వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ఎలాంటి చర్చకు దారితీస్తాయో చూడాలి.

    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: MUSIC, Tollywood, Tollywood news

    తదుపరి వార్తలు