నెల్లూరులో సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌..

ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎ.ఆర్‌. రెహమాన్‌ శనివారం ఏపీ లోని నెల్లూరులో ప్రార్ధనలు చేశాడు.

news18-telugu
Updated: November 25, 2019, 3:04 PM IST
నెల్లూరులో సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌..
Twitter
  • Share this:
ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎ.ఆర్‌. రెహమాన్‌ శనివారం ఏపీ లోని నెల్లూరు జిల్లాలో ప్రార్ధనలు చేశాడు. జిల్లాలోని  కసుమూరు దర్గాకి వచ్చిన ఆయన ఉదయం కడప పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేన్‌ను కలిసాడు. ఆ తర్వాత తన కుమారుడు అమీన్‌తో కలిసి ఆదివారం ఉదయం మస్తాన్‌వలీ గంధోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ రెహమాన్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ గంధోత్సవ కార్యక్రమానికి ఆయన ఏటా వస్తుంటారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అక్కడి సాధారణ ప్రజలు, భక్తులు రెహమాన్‌‌ను చూసేందుకు పోటీపడ్డారు. దీంతో కొంత గందరగోళం జరిగి సద్దుమణిగింది. గంధోత్సవంలో పాల్గొన్న అనంతరం ముజావర్, రెహమాన్‌ మిత్రుడైన సులేమాన్‌ ఇంటికి వెళ్లి కొద్దిసేపు విరామం తీసుకున్నారు. ఆ తర్వాత కొడుకుతో కలిసి చెన్నై బయలుదేరాడు.
అందంతో మతిపోగుడుతోన్న కియారా అద్వానీ..


First published: November 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు