Home /News /movies /

MURARIVA SONG ADDED TO THE SARKARU VAARI PAATA MOVIE HERE ARE THE DETAILS SR

Mahesh Babu : మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన నమ్రత.. సోషల్ మీడియా వేదికగా ప్రకటన..

Mahesh Babu Photo : Twitter

Mahesh Babu Photo : Twitter

Mahesh Babu | Sarkaru Vaari Paata : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకోంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేశారు. థమన్ సంగీతం అందించారు.

ఇంకా చదవండి ...
  Mahesh Babu | Sarkaru Vaari Paata : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకోంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక అది అలా ఉంటే మూడవ వారంలోకి అడుగు పెట్టిన సర్కారు వారి పాట నుంచి ఓ అదిరిపోయే ట్రీట్ రాబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు సంగీత దర్శకుడు తమన్ కూడా ఓ పోస్టర్’ను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. మురారివా పాటను ఈరోజు నుంచి సినిమాకు యాడ్ చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని నమ్రత తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పాట సర్కారు వారి పాట సెకండాఫ్‌లో రానుందని తెలుస్తోంది. మరి ఈ మురారి వా పాట ఎంత వరకు ఆడియెన్స్‌ను థియేటర్స్‌రు తీసుకొస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

  ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తంగా 120 కోట్లకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. సీడెడ్ 13 కోట్లకు, ఉత్తరాంధ్ర 12. 50 కోట్లకు.. ఈ స్ట్ 8.50 కోట్లకు, వెస్ట్ 7 కోట్లకు, గుంటూరు 9 కోట్లకు, కృష్ణ 7.50 కోట్లకు, నెల్లూరు 4 కోట్లకు ఇక ఏపీ తెలంగాణ మొత్తంగా 96. 50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక కర్నాటక 8.50 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లకు, ఓవర్సీస్ 11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. మొత్తంగా 120 కోట్లకు అమ్ముడు పోయింది. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 121 కోట్లు రావాల్సి ఉంది.  సర్కారు వారి పాట కలెక్షన్స్ విషయానికి వస్తే..ఈ సినిమా మూడో వీకెండ్‌లోకి అడుగు పెట్టి.. కలెక్షన్స్ విషయంలో డౌన్ అయ్యింది. ఇక ఈ సినిమా 20 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 16 లక్షల షేర్‌ని అందుకోగా వరల్డ్ వైడ్‌గా 20 లక్షల షేర్ ని సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు ఈ సినిమా 108.98 కోట్ల షేర్‌ను, 175.65 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. 121 కోట్ల టార్గెట్ కి ఈ సినిమా ఇంకా 12.02 కోట్ల మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అంత మొత్తం రాబోయే రోజుల్లో వసూలు చేయడం కష్టం అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక్కడ విషయం ఏమంటే.. ఇప్పటికే ఎఫ్ 3 వచ్చింది. ఇక ఆ తర్వాత మేజర్, విక్రమ్ అంటూ సినిమాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అంటున్నారు.

  Sarkaru Vaari Paata Movie How Much Collect To Brek Even Now Total 18 Days World Wide Box Office Collections,Sarkaru Vaari Paata : మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ఎంతకు అమ్మారు.. బాక్సాఫీస్ దగ్గర ఇంకా ఎంత బాకీ ఉన్నాడంటే..
  Sarkaru Vaari paata Twitter


  ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకి దక్కించుకుంది. ఇక ఒప్పందంలో భాగంగా ఈ సినిమాను అమేజాన్ ప్రైమ్ జూన్ 10న స్ట్రీమింగ్ తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి కళావతి (Kalaavathi song) అనే సాంగ్‌‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు.  థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి.

  Sarkaru Vaari Paata Collections, సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్, సర్కారు వారి పాట కలెక్షన్స్, సర్కారు వారి పాట, మహేష్ బాబు
  Sarkaru Vaari Paata Photo twitter


  ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ సాధించి కేక పెట్టిస్తోంది. ఇక రెండవ సింగిల్‌గా వచ్చిన పెన్నీ సాంగ్ (Penny Music Video) కూడా మంచి ఆదరణ పొందుతోంది.ఈ పాట సూపర్ స్టైలీష్‌గా ఉంటూ.. ఇన్‌స్టాంట్ హిట్‌గా నిలిచింది. ఆ పాటలో మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ మరో హైలైట్‌గా ఉంది. నాకాష్ ఆజీజ్ పాడగా... అనంత శ్రీరామ్ రాశారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్’గా నటించారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Keerthy Suresh, Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు