MUMBAI TV ACTRESS URFIZAVED WHO COUNTERED NETIZENS AS TO WHY I LIKE HER SNR
Urfizaved: నా ఇష్టం ఇలాగే ఉంటా..ఎలాగైనా తిరుగుతా మీకేంటి : ఉర్ఫీ జావెద్
(Photo Credit:Instagram)
Urfizaved:ఉర్ఫీ జావెద్ నెటిజన్ల కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చింది. తాను ఎలాగైనా ఉంటాను మీకెందుకు అంటూ ఓ వీడియోని తన ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. తన దుస్తులు, హెయిర్ స్టైల్‌పై రోజూ కామెంట్స్ చేస్తున్న సోషల్ మీడియా ఫాలోవర్స్‌ని ఉద్దేశించే రిలీజ్ చేసిన వీడియోపై కూడా విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.
ఉర్పీ జావెద్ ( Urfizaved)పరిచయం చేయనవసరం లేని పేరు. ముంబైలో మోడల్ కమ్ టీవీ యాక్టరస్(TV actress) అనే పేరు సంపాధించుకున్న ఈ హాట్ లేడీ...సోషల్ మీడియా(Social media)లో మాత్రం టాప్ సెలబ్రిటీ(Celebrity)గా మారిపోయింది. వింత వింత డ్రెస్(Dress)లు, విచిత్రమైన హెయిర్ స్టైల్స్(Hair Styles)తో నిత్యం వార్తల్లో ఉంటూ నెటిజన్ల(Netizens)తో చివాట్లు తింటూ ఉంటుంది. అసలు ఉర్ఫీ జావెద్ దుస్తులు వేసుకుంటుందా లేదా అనే సందేహాలు వచ్చేంత కురచ బట్టలు, పొట్టి డ్రెస్సులు వేసుకుంటోంది. అంతే కాదు వైర్లు, గన్నీ బ్యాగ్‌లను డ్రెస్‌లు మార్చేసి వేసుకోవడంతో ఇప్పటి వరకు ఉర్ఫీజావెద్ కాస్ట్యూమ్స్ కోసం ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారా లేక ఆమె డిజైన్ చేసుకుంటుందా అనే విధంగా నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు ఫాలోవర్స్.
నా ఇష్టం..మీకేంటి ..
రీసెంట్గా ఉర్ఫీజావెద్ రెండు నిక్కర్ల డ్రెస్‌తో దిగిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె తన డ్రెస్‌ని నెటిజన్లు కామెంట్ చేస్తారని తెలిసే డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చింది. నేను తిరుగుతాను, గెంతుతాను,ఎవరితోనైనా ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్తాను.. లేదంటే ఒంటరిగానే ఉంటాను..ఆడతాను , పాడతాను నా ఇష్టం మీకేంటి అంటూ వాయిస్‌తో కూడిన వీడియోని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసింది. ఉర్పీజావెద్ షేర్ చేసిన వీడియోపై కూడా నెటిజన్లు ట్రోలింగ్ ఆపడం లేదు. మేం చూడటానికే కదా నువ్వు ఇన్ని వేషాలు వేస్తుంది..అలాంటప్పుడు మేం ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా మీకెందుకు అంటున్నావెందుకు అని రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.
నెటిజన్లకు కౌంటర్..
ఉర్ఫీజావెద్ నటిగా బాదే భయ్యాకీ దుల్మనియా సీరియల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మేరీ దుర్గాతో నటిగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఓటీటీలో టెలికాస్ట్ అయిన బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా కూడా బాగానే పర్ఫామ్ చేసి షో నుంచి ఎలిమినేట్ అయింది. బిగ్‌బాస్ షోలో ఎలిమినేట్ కావడంతో ఆమె పాపులారిటీ సోషల్ మీడియాలో బాగా పెరిగింది. దాంతో అదే కంటిన్యూ చేయాలని ఈ విధంగా రెండు ముక్కల డ్రెస్‌లు, చిరిగిపోయిన కాగితాలతో డ్రెస్‌లు, తాళ్లు, వైర్లు, పెయింటింగ్ విచ్చలవిడిగా ఫోటోలు దిగి నెటిజన్ల చూపును తనవైపు తిప్పుకునేలా చేస్తోంది.
ముందు ముందు ఇంకెన్ని చూడాలో..
తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ ఇండస్ట్రీలో బాంబ్ పేల్చిన ఈ శృంగార తార..ఇప్పుడు మాత్రం ఎవరెన్ని అనుకున్నా...ఎవరేం కామెంట్ చేసిన పట్టించుకోను అంటూ తెగేసి మరీ చెబుతోంది. ఉర్ఫీ జావెద్ వాలకం చూస్తుంటే ఇకపై ఇంత కంటే పొదుపైన దుస్తులు వేసుకుంటాను చూస్తే చూడండి లేకపోతే కళ్లు మూసుకోండి అని చెప్పకనే చెప్పినట్లు ఉందంటున్నారు సోషల్ మీడియా ఫాలోవర్స్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.