క్లైమాక్స్ దిశగా సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు.. పోలీసుల పరిశోధనలో వెల్లడైన నిజాలు ఏమిటంటే..

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి సరిగ్గా ఈ రోజుకు నెల రోజులు కంప్లీట్ అయింది. గత నెల 14న ఆయన తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.సుశాంత్ ఆత్మహత్య దాదాపు క్లోజింగ్ దశకు చేరకుంది. ఈ సందర్భంగా పోలీసుల దర్యాప్తులో..

news18-telugu
Updated: July 14, 2020, 9:36 AM IST
క్లైమాక్స్ దిశగా సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు.. పోలీసుల పరిశోధనలో వెల్లడైన నిజాలు ఏమిటంటే..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput/twitter)
  • Share this:
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి సరిగ్గా ఈ రోజుకు నెల రోజులు కంప్లీట్ అయింది. గత నెల 14న ఆయన తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.  అయినా కూడా ఈయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హీరోగా మంచి కెరీర్ వదిలేసి అర్ధాంతరంగా చనిపోవాల్సిన అవసరం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు లేదని.. ఆయన్ని ఎవరో పక్కా ప్లాన్ ప్రకారమే చంపేసారని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ సుశాంత్ నిజంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటే ఎందుకు ఈ కేసులో ఎన్నో సాక్ష్యాధారాలను ప్రజల ముందుకు తీసుకురావడం లేదని అడుగుతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే సిబిఐ ఎంక్వైరీకి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు అప్పగించాలంటూ ఒత్తిళ్లు కూడా ప్రభుత్వంపై భారీగానే వస్తున్నాయి. సుశాంత్ సొంత రాష్ట్రం బీహార్ అభిమానులు అయితే రాస్తారోకోలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే  బిజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా దీనిపై సానుకూలంగా స్పందించాడు. ఒకవేళ నిజంగానే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో నిజాలు దాస్తున్నారనిపిస్తే కచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి కేసు అప్పగించడానికి ఏ మాత్రం వెనకాడమని వివరించారాయన.

సుబ్రమణ్య స్వామి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput subramanian swamy)
సుబ్రమణ్య స్వామి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput subramanian swamy)


ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో 35 కు మందిని  ప్రశ్నించారు ముంబై పోలీసులు. ఇప్పటికే సుశాంత్ కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, తోటి నటీనటులతో పాటు కొంత మంది దర్శక, నిర్మాతల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఇప్పటికే సుశాంత్ గదిలో లభించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విచారణలో సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలపై  ఎలాంటి వాస్తవాలు బయటకు రాలేదని పోలీసులు చెబుతున్నారు. సుశాంత్ ఆత్మహత్యపై వేరొకరి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగింది. త్వరలోనే సుశాంత్ ఆత్మహత్యపై ఫైనల్ రిపోర్ట్ రెడీ చేసి సమర్పిస్తామని ముంబై పోలీసులు చెబుతున్నారు. మహా అయితే పది రోజుల్లో ఈ కేసును మూసివేసే దిశగా నడుస్తోంది. దీంతో ఎంతో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎలాంటి మలుపులు లేకుండా ముగియబోతుందని ఇంటర్నల్ టాక్.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 14, 2020, 9:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading