Payal Ghosh-Anurag Kashyap : అనురాగ్‌కు నోటీసులు పంపిన ముంబై పోలీసులు..

Payal Ghosh-Anurag Kashyap : దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని పాయల్ ఘోష్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: September 30, 2020, 2:11 PM IST
Payal Ghosh-Anurag Kashyap : అనురాగ్‌కు నోటీసులు పంపిన ముంబై పోలీసులు..
అనురాగ్ కశ్యప్ Photo : Twitter
  • Share this:
Payal Ghosh : పాయల్ ఘోష్... మంచు మనోజ్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన 'ప్రయాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్. ఆ సినిమాలో క్యూట్‌గా హారిక పాత్రలో అలరించిన పాయల్.. ఆ తర్వాత ఎన్టీఆర్ ఊసరవెల్లిలో మెరిసింది. ఓ పది సినిమాల్లో చేసిన ఏ సినిమా ఈ భామకు సరైనా గుర్తింపును ఇవ్వలేదు. అది అలా ఉంటే పాయల్ ఇటీవల బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైగింకంగా వేధించాడని సోషల్ మీడియా వేదికగా ఆరోపించిన విషయం తెలిసిందే. ఓ సందర్భంలో తనకు కథ చెబుతానని చెప్పిన అనురాగ్ కశ్యప్.. తన గదిలోకి తీసుకెళ్లాడని .. ఆ సమయంలో అనురాగ్‌ కశ్యప్‌ 'బాంబే వెల్‌వెట్‌' సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడని చెప్పింది. అయితే ఆ సినిమాలో నటించాలనుకుంటే తనతో పడక సుఖాన్ని పంచుకోవాలని కోరినట్టు పాయల్ ఆరోపణలు చేసింది.

అంతేకాదు తనతో సన్నిహితంగా మెలిగితే భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో ఆఫర్స్ ఇస్తానని చెప్పినట్టు పాయల్ పేర్కొంది. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో శారీరక సంబంధం కలిగి ఉండటం పెద్ద తప్పేం కాదన్నట్లు చెప్పాడు. తనకు శారీరక సుఖాన్ని అందించాలని కోరుతు తనను తాకాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో తను ఎలాగో అలా తప్పించుకొని వచ్చినట్టు చెప్పింది పాయల్. ఇక ఈ విషయంలో అనురాగ్ పై ఓ కేసు కూడ నమోదు చేసింది. అతని పై కంప్లైట్ చేసినందకు తనకు వివిధ వ్యక్తులు నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్  వస్తున్నాయని పాయల్ తెలిపింది. ఈ సందర్భంగా తనకు ప్రాణ రక్షణ కల్పించమని.. రీసెంట్‌గా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీని కలిసి తాజా పరిస్థితుల నేపథ్యంలో తనకు వై కేటిగిరీ భద్రతను కల్పించాలని గవర్నర్ ను కోరింది పాయల్. లైంగికంగా తనను కశ్యప్ వేధించాడని.. తనకు న్యాయం చేయాలంటూ పాయల్‌ ప్రధాని నరేంద్ర మోదీని కోరిన విషయం తెలిసిందే.

అది అలా ఉంటే పాయల్‌ ఘోష్‌ ఫిర్యాదు మేరకు ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేష‌న్‌లో పోలీసులు అనురాగ్‌పై కేసు నమోదు చేశారు. బుధవారం సమన్లు పంపించారు. గురువారం ఉదయం 11 గంటలకు పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని అనురాగ్‌ కశ్యప్‌‌కకు పంపిన సమన్లలో పోలీసులు పేర్కొన్నారు. ఇక మరోవైపు అనురాగ్ కశ్యప్ చాలా మంచి వాడని.. కావాలనే పాయల్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని కొందరు హీరోయిన్స్, సినీ ప్రముఖులు అనురాగ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. తాప్సీ ఓ ఇంటర్వూ అనురాగ్ అలాంటీ వాడు కాదని పేర్కోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మతో పాటు పలువురు ప్రముఖులు అనురాగ్‌కు మద్దతుగా నిలిచారు.
Published by: Suresh Rachamalla
First published: September 30, 2020, 2:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading