సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో భన్సాలీని ప్రశ్నించిన ముంబై పోలీసులు..

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్ వర్గాలతో పాటు సినీ అభిమానులను  నిర్ఘాంత పోయేలా చేసింది.తాజాగా ఈ కేసులో బాంద్రా పోలీసులు ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ప్రశ్నిస్తున్నారు.

news18-telugu
Updated: July 6, 2020, 1:51 PM IST
సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో భన్సాలీని ప్రశ్నించిన ముంబై పోలీసులు..
సుశాంత్ కేసులో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ప్రశ్నిస్తోన్న మంబై పోలీసులు (ANI/Twitter)
  • Share this:
బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్ వర్గాలతో పాటు సినీ అభిమానులను  నిర్ఘాంత పోయేలా చేసింది. 34 సంవత్సరాల వయసున్న ఈయన బాంద్రాలోని తన ఇంట్లోనే గత నెల 14న  సూసైడ్ చేసుకున్నాడు. ఈయన మరణవార్త తెలుసుకున్న అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదిలా ఉంటే సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజమ్‌తో పాటు బయటి వాళ్లను ఎదగనీయకుండా ఎంత స్థాయిలో తొక్కేస్తున్నారనేది మరోసారి అర్థమైపోయింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ముంబై పోలీసులు తమ విచారణను వేగవంతం చేసారు. ఇప్పటికే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తితో పాటు ఇంటి పని మనుషులతో పాటు ఆయనతో సంబంధం ఉన్న వాళ్లను పోలీసులు తమదైన కోణంలో ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇప్పటికే ముంబై పోలీసులు సుశాంత్ కేసు విషయమై 29 మందిని విచారించారు.తాజాగా ఈ రోజు ముంబైలోని బాంద్రా పోలీసులు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని పోలీస్ స్టేషన్‌కు రప్పించి విచారణ చేస్తున్నారు.

mumbai police interrogates director sanjay leela bhansali sushant singh rajput suicide case,sushant singh rajput,sanjay leela bhansali,police interrogates sanjay leela bhansali,bandra poliece interrrogates, rhea chakraborty,rhea chakraborty case filed,police intergates heroine rhea chakraborty,police intergates heroine rhea chakraborty,rhea chakraborty sushant singh rajput,sushant singh rajput rhea chakraborty marriage,mankita lokhande,ankita lokhande sushant singh rajput,ankita lokhande offer condolences to sushant family,sushant singh rajput last rights complete, suicide,sushant singh rajput cbi enquiry,sushant singh rajput cbi,sushant singh rajput postmortem complete,sushant singh rajput postmortem,sushant singh rajput,sushant singh rajput death,sushant singh rajput rare photos,sushant singh rajput unseen photos,sushant singh rajput twitter,sushant singh rajput dies,sushant singh rajput hero death,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రేర్ ఫోటోస్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అన్‌సీన్ ఫోటోస్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్‌మార్టమ్ కంప్లీట్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్‌మార్టమ్,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ ఎంక్వైరి,సీబీఐ ఎంక్వైరి,'సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంత్యక్రియలు పూర్తి,సుశాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అంకిత లోకండే,అకింతా లోఖండే,రియా చక్రబర్తి,రియా చక్రబర్తితో సుశాంత్ పెళ్లి,రియాను విచారిస్తోన్న పోలీసులు,రియా చక్రవర్తిపై కేసు నమోదు,సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో సంజయ్ లీలా భన్సాలీని ప్రశ్నించిన పోలీసులు,సంజయ్ లీలా భన్సాలీని ప్రశ్నిస్తోన్న పోలీసులు,పోలీసుల అదుపులో సంజయ్ లీలా భన్సాలీ,
సుశాంత్ కేసులో  సంజయ్ లీలా భన్సాలీని ప్రశ్నిస్తోన్న మంబై పోలీసులు (ANI/Twitter)


మరోవైపు ఈ కేసు విషయమై పోలీసులు కంగనా రనౌత్‌తో పాటు దర్శకుడు శేఖర్ కపూర్ స్టేట్‌మెంట్స్ కూడా రికార్డు చేయనున్నారు. ఇక శేఖర్ కపూర్... సుశాంత్ సింగ్‌తో అప్పట్లో ‘పానీ’ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. తీరా పరిస్థితులు అనుకూలించక ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండా ఆగిపోయింది. ఈ సినిమానే కాదు.. మరో అర డజనుకు పైగా చిత్రాలు సుశాంత్‌కు వరకు వచ్చి ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో తనకు సినిమా అవకాశాలు లేకుండా చేస్తున్నారనే డిప్రెషన్‌తో సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 6, 2020, 1:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading