హోమ్ /వార్తలు /సినిమా /

డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరో ‘బావమరిది’ అరెస్ట్.. జైలుకు తరలించిన పోలీసులు

డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరో ‘బావమరిది’ అరెస్ట్.. జైలుకు తరలించిన పోలీసులు

అర్జున్ రాంపాల్

అర్జున్ రాంపాల్

గతంలో ఇదే హీరోను డ్రగ్స్ కేసులో అధికారులు విచారించారు. ఈయన గర్ల్ ఫ్రెండ్‌ను కూడా డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ చేశారు.

డ్రగ్స్.. ప్రస్తుతం సినీ సెలబ్రిటీలకు పట్టి పీడుస్తున్న అతి పెద్ద సమస్య. డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతో మంది ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. చాలామంది హీరో హీరోయిన్లను పిలిచి మరి విచారణ చేపట్టారు. తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో మరో ప్రముఖ హీరో బావమరిది కటకటాల పాలయ్యాడు. బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ గర్ల్ ఫ్రెండ్ అయిన గాబ్రియెల్లా సోదరుడు డెమెట్రియాడెస్ ఏజిసిలాస్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణాఫ్రికా దేశస్థుడైన డెమెట్రియాడెస్ గత కొద్దికాలంగా ముంబైలో ఉంటున్నాడు. అర్జున్ రాంపాల్‌ గర్ల్‌ఫ్రెండ్‌కు స్వయాన సోదరుడు డెమెట్రియాడెస్ అనే విషయం తెలిసిందే.

డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎజిసిలాస్, డెమెట్రియాడెస్‌పై 2021 సెప్టెంబర్‌లో వారెంట్స్ జారీ చేసిన విషయం తెలిసిందే.ఎన్‌డిపిఎస్ కోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది అతనిపై చర్య తీసుకున్నారు. అజిసియాలోస్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన పలు కేసుల్లోఆయన ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌సిబి నమోదు చేసిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్స్ కేసులో కూడా డెమెట్రియాడెస్ నిందితుడిగా పేర్కొన్నాడు.

త ఏడాది సెప్టెంబర్ 21న ముంబైలోని ఎన్‌డిపిఎస్ కోర్టు ఉత్తర్వులు జారీ చేయగా, దానిని అతను బాంబే హైకోర్టులో సవాలు చేశాడు. అయితే తాజాగా అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో గోవాలో డెమిట్రియాడెస్‌ను కొద్ది రోజుల క్రితం అదుపులోకి తీసుకొన్నారు. అప్పటి నుంచి గోవాలో రిమాండ్‌లో ఉన్నారు. గోవాలోని బాంబే హైకోర్టు పలుమార్లు అతడి బెయిల్ పిటిషన్‌ను రిజెక్ట్ చేసింది. గోవా హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది. దీంతో అతడిని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించాలని ముంబై పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు.

గతంలో డ్రగ్స్ కేసులో అర్జున్ రాంపాల్ భాగస్వామి గ్యాబ్రిలా డెమెట్రియాడెస్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇదే వ్యవహారంపై అర్జున్ రాంపాల్‌ను కూడా ఎన్సీబీ విచారించింది. ఉత్తర గోవాలోని వారి ఇంటి నుంచి హాషిష్, చరస్ కొంత మొత్తంలో సీజ్ చేశామని అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖేడే తెలిపారు.

First published:

Tags: Arjun Rampal, Bollywood news, Drugs case

ఉత్తమ కథలు