అమితాబ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది.. డాక్టర్స్ ఏమంటున్నారు..?

Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు కరోనా సోకిన విషయం తెలియగానే దేశవ్యాప్తంగా అతడి అభిమానులు పూజలు మొదలు పెట్టారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 13, 2020, 8:18 PM IST
అమితాబ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది.. డాక్టర్స్ ఏమంటున్నారు..?
అమితాబ్ బచ్చన్ (amitabh bachchan)
  • Share this:
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు కరోనా సోకిన విషయం తెలియగానే దేశవ్యాప్తంగా అతడి అభిమానులు పూజలు మొదలు పెట్టారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చిందని తెలిసిన తర్వాత ఆందోళన చెందుతున్నారు. అయితే వైద్యులు చెప్పింది విన్న తర్వాత వాళ్ల మనసు కుదుటపడింది. ఇప్పటికే అభిషేక్ బచ్చన్ దాదాపు కరోనా నుంచి బయటికి వచ్చినట్లే అంటున్నారు వైద్యులు. తండ్రీ కొడుకులు ముంబయిలోని నానావతి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. (Video Credits: Mojo Story)


అయితే ఈ ఇద్దరికి కరోనాకు ఇచ్చే పూర్తిస్థాయి చికిత్స అవసరం లేదని నిర్థారించారు వైద్యులు. ఇప్పటికే అభిషేక్ దాదాపు దాన్నుంచి బయటికి వచ్చేసాడు. ఇక అమితాబ్ బచ్చన్ మాత్రం ప్రస్తుతం గొంతు నొప్పి, జ్వరంతో బాధ పడుతున్నాడని తెలిపారు వైద్యులు. ఆయన కూడా వీడియో బైట్ విడుదల చేసి తాను బాగానే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన కుటుంబం కోసం ప్రార్థించిన వాళ్లందరికీ చేతులెత్తి నమస్కారం చేసాడు బిగ్ బి.ప్రస్తుతం అమితాబ్ జ్వరం అదుపులోకి వచ్చిందని తెలిపారు నానావతి వైద్యులు. కానీ కొంచెం ఒళ్లు నొప్పులు మాత్రం ఉన్నాయని చెప్పారు. మరోవైపు అభిషేక్‌కు అసలు కరోనా లక్షణాలే లేవని ప్రకటించారు వైద్యులు. అతడ్ని ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉంచినట్టు తెలిపారు. మరోవైపు ఐశ్వర్యరాయ్, ఆమె కూతురు ఆరాధ్య ఇంట్లోనే ఉండిపోయారు. మొత్తానికి అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా నుంచి మరో నాలుగైదు రోజుల్లో బయట పడుతుందని వైద్యులు చెప్తున్నారు. వాళ్లకు అప్పుడు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: July 13, 2020, 8:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading