Crime : ఆత్మహత్య చేసుకున్న వర్ధమాన నటి ... భవనం పైనుంచీ దూకి...

Mumbai Crime : 25 ఏళ్ల ఆ యువతి భవనం పై నుంచీ కిందకు దూకేసింది. బాలీవుడ్‌లో కెరీర్ వెతుక్కోవాలనుకున్న ఆమె ఎంతుకు సూసైడ్‌ చేసుకుంది?

Krishna Kumar N | news18-telugu
Updated: August 30, 2019, 7:35 AM IST
Crime : ఆత్మహత్య చేసుకున్న వర్ధమాన నటి ... భవనం పైనుంచీ దూకి...
పెర్ల్ పంజాబీ
  • Share this:
అది ముంబై... ఒషివారాలోని... లోఖండ్‌వాలా ఏరియా.... అక్కడి కెన్ వుడ్ భవనం దగ్గర భారీ శబ్దం వచ్చింది. ఏ పూల కుండీయో పైనుంచీ కింద పడి ఉంటుందనుకున్నారు కొందరు. తీరా చూస్తే... కింద రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ కనిపించింది ఓ యువతి. ఆమె పేరు పెర్ల్ పంజాబీ. వయసు పాతికేళ్లు. బాలీవుడ్ సినిమాల్లో నటించాలనే ఆశతో వచ్చిన ఆమెకు... అదృష్టం తలుపుతట్టలేదు. ఒక్క అవకాశం దక్కితే చాలు... టాలెంట్ నిరూపించుకుందామని ఆమె ఎన్నో ఫిల్మ్ ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఆఫర్లు రాలేదు. ఏవో చిన్నా చితకా కేరక్టర్లు తప్పితే... హీరోయిన్ గానో, సెకండ్ హీరోయిన్ గానో ఛాన్సులు రాలేదు. ఏం చెయ్యాలో తెలియక... ఓ ప్రైవేట్ కంపెనీలో చేరింది. ఐతే... ఇలా సినిమా ఇండస్ట్రీలోకి ఆమె వెళ్లాలనుకోవడం... ఆమె తల్లికి నచ్చలేదు. అందుకే... ఆ ప్రయత్నాలు మానుకోమని ఆమె పదే పదే కోరేది. ఈ విషయంలో తల్లీ, కూతురి మధ్య గొడవలు కూడా అయ్యేవి. ఇలాంటి పరిస్థితులన్నీ కలిసి మెంటల్‌గా డిస్టర్బ్ అయిన పంజాబీ... సూసైడ్ చేసుకోవడానికి పై నుంచీ దూకేసింది. వెంటనే ఆమెను కోకిలాబెన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయినట్లుగా డాక్టర్లు తేల్చారు.

పెర్ల్ పంజాబీ


పోలీసుల దర్యాప్తులో మరో భయంకరమైన విషయం తెలిసింది. పంజాబీ... ఇదివరకు రెండుసార్లు వేర్వేరు రకాలుగా చనిపోవడానికి ప్రయత్నించి ఫెయిలైంది.


ఈసారి ఆమె చనిపోవడానికి కుటుంబ సభ్యులతో ముందు రోజు జరిగిన గొడవే కారణం అయివుండొచ్చంటున్నారు పోలీసులు. కేసు రాసి... ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
First published: August 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు