Mumaith Khan: పోకిరి భామ ముమైత్ ఖాన్‌కు పాకిస్థాన్‌తో లింకులు.. అసలు నిజం ఏమిటంటే.. ముమైత్ ఖాన్.. నిన్న మొన్నటి వరకు తనదైన డాన్సులతో కుర్రకారును నిద్రపట్టకుండా చేసిన భామ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ సినిమాలో ఇప్పటి కింకా నా వయసు నిండా పదహారే సినిమాతో ఓవర్ నైట్ నెంబర్ వన్ డాన్సర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతకు మందు ఈమె బాలీవుడ్‌తో పాటు తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో మెరిసింది. తాజాగా ఈమె ఆలీతో సరదగా కార్యక్రమంలో పాల్గొని తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా తన తండ్రి, తల్లి గురించిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. మహారాష్ట్రలోని ముంబైలో పుట్టి పెరిగిన ముమైత్ ఖాన్.. తల్లిది తమిళనాడులోని చెన్నై అయితే.. తండ్రిది మాత్రం పాకిస్థాన్ అని చెప్పుకొచ్చింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికి వాళ్ల కుటుంబం భారతదేశానికి వలస వచ్చారట. అప్పటి నుంచి ఇక్కడే సెటిలయ్యారు. ఇక వాళ్ల అమ్మా, నాన్నలు కూడ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు వెల్లడించింది ముమైత్ ఖాన్.

ముమైత్ ఖాన్ (Twitter/Photo)
పాకిస్థాన్‌లో ఇంకా ముమైత్ ఖాన్‌కు తండ్రికి సంబంధించిన చుట్టాలున్నారని చెప్పుకొచ్చారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఒడియా, భోజ్‌పురితో పాటు పలు భాషల్లో ఐటెం సాంగ్స్ చేసింది. తెలుగులో ఈమె ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజన్ 1లో ఓ కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. తిక్కా సినిమా తర్వాత కొన్ని రోజులు కోమాలో ఉన్న ఈ భామ.. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలిపింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:February 23, 2021, 14:13 IST