హోమ్ /వార్తలు /సినిమా /

Tollywood Drugs Case : ఈడీ ముందుకు ముమైత్ ఖాన్.. కొనసాగుతోన్న విచారణ...

Tollywood Drugs Case : ఈడీ ముందుకు ముమైత్ ఖాన్.. కొనసాగుతోన్న విచారణ...

Mumaith Khan Photo : Twitter

Mumaith Khan Photo : Twitter

Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్ కేసులో భాగంగా ఈడీ ముందుకు ఈరోజు నటి ముమైత్ ఖాన్ హాజరు అయ్యారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇక ఇదే కేసులో ఇప్పటికే పూరి జగన్నాథ్‌ను ప్రముఖ నటి, నిర్మాత (Charmi) ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్‌, నందు, రానా, రవితేజ, రానా, నవదీప్‌లను ఈడీ అధికారులు ప్రశ్నించారు.

ఇంకా చదవండి ...

Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్  కేసులో (Tollywood Drugs Case) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఇప్పటికే పలువురు సినీ నటులు, దర్శకులను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం టాలీవుడ్‌లో పెద్ద ప్రకంపనలు పుట్టించిన డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పలువురుకి క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఈ కేసులో చిన్న పెద్దా అని తేడా లేకుండా చాలా మంది హీరోలు, హీరోయిన్లు, నటీనటుల, దర్శకుల చుట్టూ డ్రగ్స్ రాకేట్ ఉచ్చు బిగుసుకుంది. అందులో స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఉండటం సంచలనంగా మారింది. ఒకప్పుడు బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ మాఫియా.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీలకి కూడా పాకింది.అంతేకాదు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొంత మంది సెలబ్రిటీలు డ్రగ్స్ మాఫియాకు హవాలా రూపంలో చెల్లింపులు చేసారని అరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం విచారణ సాగుతోంది.

ఇపుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  హవాల రూపంలో జరిగిన లావాదేవీలపై ఇంటర్‌పోల్ సహాయం తీసుకుంటోంది. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న నటీనటులకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీస్తోంది. ఈ కోవలో భాగంగా మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌ను ప్రముఖ నటి, నిర్మాత (Charmi) ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్‌, నందు, రానా, రవితేజ, రానా, నవదీప్‌లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కెల్విన్‌తో వీరికి ఉన్న సంబంధాల పైన విచారణ జరిపారు అధికారులు. అలాగే వారి బ్యాక్ లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు.

ఇక ఇదే కేసులో తాజాగా ముమైత్ ఖాన్ (Mumaith Khan)ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అందులో భాగంగా ముమైత్ ఖాన్ కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్‌ కోణంలో అధికారులు ఆమె బ్యాంకు ఖాతాలను పరిశీలించనున్నారు. డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఏమైనా పరిచయం ఉందా? తదతర అంశాలపై నటి ముమైత్ ‌ఖాన్‌ను విచారించనున్నారు. ఇక ఇదే కేసులో ఈనెల 17న హీరో తనీష్, 22న మరో నటుడు తరుణ్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు.

First published:

Tags: Charmi kaur, Puri Jagannadh, Tollywood drug case, Tollywood news

ఉత్తమ కథలు