Raj Kundra Bail: పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాకు బెయిల్.. రెండు నెలల తర్వాత?

Raj Kundra Bail

Raj Kundra Bail: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పేరు గత కొన్ని రోజుల నుండి బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈయన కొన్ని రోజుల కిందట నీలి చిత్రీకరణ వ్యవహారంలో దొరికిపోయాడు. వాటిని చిత్రీకరిస్తూ ఆన్ లైన్ లో పబ్లిష్ చేస్తున్నట్లు తెలిసింది. ఇతనితో పాటు ఈ వ్యవహారంలో మరికొంతమంది చేతులు ఉన్నట్లు బయటపడింది.

  • Share this:
    Raj Kundra Bail: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పేరు గత కొన్ని రోజుల నుండి బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈయన కొన్ని రోజుల కిందట నీలి చిత్రీకరణ వ్యవహారంలో దొరికిపోయాడు. వాటిని చిత్రీకరిస్తూ ఆన్ లైన్ లో పబ్లిష్ చేస్తున్నట్లు తెలిసింది. ఇతనితో పాటు ఈ వ్యవహారంలో మరికొంతమంది చేతులు ఉన్నట్లు బయటపడింది. ఇక చాలామంది అమాయకులకు వెబ్ సిరీస్ లో అవకాశం ఇస్తామని చెప్పి వారిని బలవంతంగా అటువంటి వ్యవహారంలోకి దింపినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈయనకు ఈ కేసులో బెయిల్ దొరికింది.

    గత కొన్ని రోజుల కిందట ఈ వ్యవహారం బయటపడటంతో పాటు అతడు వీటి కోసం ఏర్పాటు చేసుకున్న హాట్ షాట్ అనే యాప్ ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించారు. ఆ తర్వాత మరో యాప్ బాలి ఫేం అనే పేరుతో ఏర్పాటు చేయగా ఈ విషయాన్ని ముంబై పోలీసులు ముందుగానే తెలుసుకొని మీడియా ముందు బయట పెట్టారు. ఇక రాజ్ కుంద్రా ఈ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ బ్యూరో కి చెందిన ఓ అధికారిని కూడా అతనికి తెలియ కుండానే అతడిని భాగస్వామి చేశాడు.

    ఇది కూడా చదవండి:భర్త రాజ్ కుంద్రా కేసుపై శిల్పా శెట్టి ఘాటు వ్యాఖ్యలు!

    ఇక అతని భార్య పేరు మీదనే ఈ యాప్ చేశారని బయటపడగా ఆ అధికారి ఆ విషయాలను కూడా బయట పెట్టాడు. ఇక ఈ కేసును బాగా శ్రద్ధ తీసుకోగా అందులో కొంతమంది పేర్లు కూడా బయట పడ్డాయి. దాంతో మరో బోల్డ్ నటి షెర్లిన్ చోప్రా పేరు బయటపడడంతో ఆమెను విచారించగా ఇందులో రాజ్ కుంద్రా గురించి కొన్ని విషయాలు బయట పెట్టింది. అతడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని.. తనను ఓసారి ఓ గదిలో బంధించేందుకు ప్రయత్నించాడని ఆ సమయంలో అక్కడి నుంచి తప్పించుకోవడం వల్ల బయట పడ్డాను అని తెలిపింది.

    ఇది కూడా చదవండి:రాజ్ కుంద్రాలో మరో యాంగిల్ బయటపెట్టిన బోల్డ్ బ్యూటీ.. అలాంటి పనులు చేసేవాడంటూ?

    ఇక ఈ వ్యవహారంలో రాజ్ కుంద్రా భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ని కూడా విచారించగా అందులో తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిసింది. ఇక ఈ నీలి చిత్రీకరణ కేసుపై అతడికి జూలై 19న కేసు నమోదు కాగా వెంటనే అతడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ​తాజాగా ఇతడికి బెయిల్ మంజూరు అయిందని తెలిసింది. అతడు అరెస్టై రెండు నెలలు కాగా ఈరోజు అతడికి బెయిల్ మంజూరు చేసింది ముంబై కోర్టు. ఇక 50 వేల రూపాయల పూచీకత్తుపై అతడికి బెయిల్ దొరికింది.
    Published by:Navya Reddy
    First published: