Mukku Avinash Marriage : జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ అవినాష్ రీసెంట్గా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా పెళ్లి తంతులో భాగంగా హల్దీ కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పంచుకున్నారు. తాజాగా ఈ రోజు అనూజతో ఆయన వివాహాం అంగరంగ వైభవంగా జరిగింది. అనూజ మెడలో ముక్కు అవినాష్ మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచంారు. ఈ వేడుకకు జబర్ధస్త్‌తో పాటు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ దివి, అరియానా, సోహైల్‌తో పాటు జబర్ధస్త్ నటులు హాజరయ్యారు. అంతేకాదు నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా అవినాష్, అనుజ మెడలో తాళి కడుతున్న వీడియోను కమెడియన్ రాం ప్రసాద్ తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
తన పెళ్లి వీడియోను తనకు సంబంధించిన యూట్యూబ్ ఛానెల్లో విడుదల చేయాలనుకున్నారు ముక్కు అవినాష్. కానీ ఆటో రాం ప్రసాద్ మాత్రం వీళ్ల పెళ్లి వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ముక్కు అవినాష్‌కు బిగ్ షాక్ ఇచ్చారు.
View this post on Instagram
అవినాష్ విషయానికొస్తే.. గతేడాది నుంచి జబర్దస్త్ అవినాష్ కాస్తా బిగ్ బాస్ అవినాష్ అయిపోయారు. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత తనను తాను ప్రేక్షకులకు కొత్తగా చూపించుకున్నాడు ఈ కమెడియన్. ఫినాలేలో చిరంజీవి వచ్చినపుడు ఏకంగా ఈయనను రాజబాబుతో పోల్చాడు. అంత గొప్ప కమెడియన్ నీలో ఉన్నాడంటూ చిరు చెప్పేసరికి గాల్లో ఉన్నాడు అవినాష్.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ అవినాష్ రీసెంట్గా నిశ్చితార్థం చేసుకున్నారు.మన జీవితంలోకి రైట్ పర్సన్ వచ్చినప్పుడు ఏ మాత్రం వెయిట్ చేయోద్దు. మా ఫ్యామిలీలు కలిసాయి.మేము కలిసాం. అంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
Venkatesh Multistarers : అబ్బాయి రానాతో కాకుండా.. మరో క్రేజీ హీరోతో వెంకటేష్ మల్టీస్టారర్ మూవీ..
ముక్కు అవినాష్ .. గతేడాది బిగ్ బాస్ సీజన్ 4లో దాదాపు 90 రోజులు ఉన్నారు. అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అక్కడ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదిందుకున్నారు. అయితే ఆయన ఇంట్లో ఉన్నపుడు పెళ్లి గురించి కూడా చాలా చర్చ జరిగింది. ముఖ్యంగా ఈయనకు పిల్లనెవరూ ఇవ్వరు అంటూ నాగార్జున కూడా చాలా కామెడీ చేసారు.
Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఇవే..
ఆ సంగతి పక్కన పెడితే.. బిగ్‌బాస్‌లో అరియానాతో మనోడు నడిపిన కథ కూడా బాగానే పాపులర్ అయింది. ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది.. ఖచ్చితంగా ప్రేమించుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. కానీ తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ సమాధానం చెప్పారు అవినాష్.
Mukku Avinash : ముక్కు అవినాష్ ఇంట్లో మొదలైన పెళ్లి సందడి.. ఫోటోస్ వైరల్..
ఇక్కడ మరో విషయం ఏమంటే.. జబర్దస్త్ క్రేజ్ వల్ల అవినాష్‌కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిన సంగతి తెలిసిందే కదా. హౌజ్‌లో ఉన్న సమయంలో మరో కంటెస్టెంట్ అరియానాతో కొంత క్లోజ్‌గా మూవ్ అయ్యారు. దీంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే కదా. మొత్తంగా ఈ రోజు ఒకింటివాడు కావడంతో అవినాష్ పై జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టినట్టే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss, Jabardasth comedy show, Mukku avinash, Tollywood