MUDDA MANDARAM SERIAL IS COMING TO END HERE ARE THE DETAILS MK
ముగిసిన ముద్ద మందారం సీరియల్...5 ఏళ్ల ప్రయాణానికి శుభం కార్డు...
(Image: Facebook)
ముద్ద మందారం సీరియల్లో ఆఖరి ఎపిసోడ్ ఈ నెల 27న ప్రసారం కాబోతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సీరియల్ ఐదేళ్ల క్రితం మొదలైంది.
గత 5 ఏళ్ల కాలంగా తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది జీ తెలుగు ముద్ద మందారం సీరియల్. తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో టాప్ షోగా నిలవడమే కాకుండా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన ముద్ద మందారం సీరియల్ ఇప్పుడు ఎండింగ్‌కు వచ్చేసింది. హరిత, పవన్ సాయి, తనూజ గౌడ ప్రధాన పాత్రల్లో మెప్పించిన ముద్ద మందారం సీరియల్లో ఆఖరి ఎపిసోడ్ ఈ నెల 27న ప్రసారం కాబోతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సీరియల్ ఐదేళ్ల క్రితం మొదలైంది. అద్భుతమైన కథ, అంతే అద్భుతమైన పాత్రలతో అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే అఖిలాండేశ్వరి, ఆమె పెద్ద కుమారుడు దేవా, పార్వతి మధ్య ప్రేమానురాగాలతో ముద్ద మందారం తెలుగు లోగిళ్లలో అంతులేని వినోదాన్ని అందించింది.
రీసెంట్గా ఈ ఏడాది మొదట్లో 1500 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న ముద్ద మందారం సీరియల్‌ని తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో తీశారంటే ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనం అర్థం చేసుకోవచ్చు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.