Home /News /movies /

MS DHONI TO JOIN TAMIL FILM AS PRODUCER JOIN HANDS WITH NAYANTHARA FOR HIS MAIDEN KOLLYWOOD FILM SK

MS Dhoni | Nayanthara: సినిమాల్లోకి ధోనీ.. నయనతారతో ఫస్ట్ మూవీ.. షూటింగ్ ఎప్పటి నుంచంటే..

ఎంఎస్ ధోనీ, నయనతార

ఎంఎస్ ధోనీ, నయనతార

Dhoni-Nayanthara Movie: ధోనీ తొలి చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోందని... ప్రస్తుత ఐపీఎల్ సీజన్ తర్వాత దీనిపై అధికారికంగా ప్రకటన రావచ్చని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ నెలలోనే.. అంటే ఐపీఎల్ ముగిసిన వెంటనే.. సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట.

ఇంకా చదవండి ...
  భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి ((MS Dhoni) దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ.. ఐపీఎల్ (IPL 2022) రూపంలో ఫ్యాన్స్‌ని అలరిస్తూనే ఉన్నాడు. చెన్నై జట్టు ప్రదర్శన ప్రస్తుతం అంత బాగా లేకున్నప్పటికీ.. గ్రౌండ్‌లో యెల్లో జెర్సీలో ఎంఎస్ ధోనీ చూసి ఎంతో మంది ఫ్యాన్స్ మురిసిపోతుంటారు. ముఖ్యంగా తమిళనాడులో ధోనీకి వీరాభిమానులయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు ద్వారా అక్కడి ప్రజలకు బాగా దగ్గరయ్యారు ధోనీ. అతడిని ముద్దుగా తలా అని పిలుచుకుంటారు. అలాంటి ధోనీ అభిమానులందరికీ అదిరిపోయే శుభావార్త. తలా ఇప్పుడు తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నిర్మాతగా మారి సినిమాలు తీయనున్నట్లు తెలుస్తోంది.

  ధోని నిర్మించనున్న తొలి తమిళ చిత్రంలో నయనతార (Dhoni-Nayanthara Movie) ప్రధాన పాత్రలో నటిస్తుందని సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్‌ సన్నిహితుడు సంజయ్‌తో పాటు నయనతార నటించనుందని సమాచారం. ధోనీ తొలి చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోందని... ప్రస్తుత ఐపీఎల్ సీజన్ తర్వాత దీనిపై అధికారికంగా ప్రకటన రావచ్చని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ నెలలోనే.. అంటే ఐపీఎల్ ముగిసిన వెంటనే.. సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. అంటే ఈ లెక్క.. ఎంఎస్ ధోనీ తమిళ చిత్ర సీమలో పనిచేయబోతున్నాడు. క్రికెట్ తర్వాత.. తన సినిమాలతో తమిళ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకోబోతున్నాడు. ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పేసి.. సినిమాలపై పూర్తిగా దృష్టిసారిస్తారని ప్రచారం జరుగుతోంది.

  చిక్కుల్లో పవన్ కళ్యాణ్ ప్రియురాలు.. మైనర్‌పై వేధింపులు.. కేసు నమోదు..

  కాగా, ఎంఎస్ ధోనీ జీవిత కథ ఆధారంగా 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమావచ్చిన విషయం తెలిసిందే. ధోని బయోపిక్‌లో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్ర పోషించారు. తన నటన, సింప్లిసిటీతో ధోనీ జీవితాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఈ మూవీని ధోనీనే స్వయంగా ప్రమోట్ చేశారు. తమిళనాడులో దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పలువురు క్రికెటర్లు కూడా కోలీవుడ్ సినిమాల్లో నటించారు. ఇటీవల భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh)కూడా తమిళ చిత్రం 'డిక్కిలూనా'లో అతిధి పాత్ర పోషించాడు. ఇక స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'ఫ్రెండ్‌షిప్'లో ప్రధాన పాత్ర పోషించాడు. మాజీ భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan).. విక్రమ్ మూవీ కోబ్రాలో నటించాడు. ఇందులో విలన్ రోల్‌లో యాక్ట్ చేశాడు పఠాన్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

  మరో వారంలో ఓటీటీలో ఆర్ ఆర్ ఆర్‌.. అధికారిక ప్రకటన..

  ఇక నయనతార విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె పెళ్లి వార్తలు హాట్ టాపిక్‌గా ఉన్నాయి. నయనతార తన ప్రియుడు విఘ్నేశ్ శివన్‌ను జూన్న 9న పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తిరుమలలోనే పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది. నయనతారు ప్రస్తుతం కథువాకుల రెండు కాదల్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో సమంత, విజయ్ సేతుపతి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా షారుక్ ఖాన్ చిత్రం 'లయన్'లోనూ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు నయనతార. అన్నీ కుదిరితే ధోనీ సినిమా కూడా మే ఆఖరులో సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Cricket, Kollywood, Mahendra singh dhoni, MS Dhoni, Nayanthara, Sports

  తదుపరి వార్తలు