సన్ని లియోన్ కన్నా ఎం.ఎస్.ధోని, సచిన్ చాలా డేంజరట.. మెకాఫ్ సంస్థ షాకింగ్ నిజాలు..

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడని వాళ్లంటూ లేరు. అంతేకాదు మనమేదైనా వార్త కోసం సెర్చ్ చేసేటపుడు నకిలీ లింకులు తగలడం సర్వ సాాధారణమైపోయింది.

news18-telugu
Updated: October 23, 2019, 6:59 AM IST
సన్ని లియోన్ కన్నా ఎం.ఎస్.ధోని, సచిన్ చాలా డేంజరట.. మెకాఫ్ సంస్థ షాకింగ్ నిజాలు..
సచిన్,సన్ని,ధోని (Twitter/Photos)
  • Share this:
ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడని వాళ్లంటూ లేరు. అంతేకాదు మనమేదైనా వార్త కోసం సెర్చ్ చేసేటపుడు నకిలీ లింకులు తగలడం సర్వ సాాధారణమైపోయింది. వాటిని ఓపెన్ చేస్తే ఎక్కవమటుకు అశ్లీల, డేంజరస్ వె‌బ్ సెట్లకు దారితీస్తుంటాయి. ఇక నెటిజన్స్ తమ ఫేవరేట్ యాక్టర్స్, పొలిటిషన్స్, సమాచారం కోసం వెబ్‌సైట్లను వెతుకుతుంటారు. ఇదే అదనుగా వారిని లక్ష్యంగా ఎంచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనికి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు.అతడి గురించి తెలుసుకోవడానికి అభిమానులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. ఈ నేపథ్యంలో ధోని నెటింట్లో అత్యంత డేంజరస్ వ్యక్తిగా మారిపోయాడు. ఎం.ఎస్.ధోని అని మనం నెట్లో వెతికినపుడు అశ్లీల వెబ్‌సెట్స్ లింకులు రీ డైరెక్ట్ అవుతున్నాయని మెకాఫీ అనే సంస్థ తన సర్వేలో వెల్లడించింది. ఇలాంటి సెలెబ్రిటీల జాబితాలో ఎవరెనున్నారో ఓ నివేదిక సిద్ధం చేసింది. ఇందులో సన్ని లియోన్,  రాధిక ఆప్టే, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, శ్రద్ధా కపూర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ఇందులో ప్రధానంగా ఉన్నారు.

ms dhoni sachin tendulkar became riskiest celebrities more than sunny leone says mcafee,sunny leone,ms dhoni,mahendra singh dhoni,sachin tendulkar,sunny leone ms dhoni sachin tendulkar,sunny leone twitter,sunny leone instagram,sunny leone facebook,ms dhoni twitter,ms dhoni instagram,sachin tendulkar twitter,sachin tendulkar facebook,సన్ని లియోన్,ఎంఎస్ ధోని,సన్ని లియోన్,సన్ని లియోన్ ఎంఎస్ ధోని,సచిన్ టెండూల్కర్,ఎంఎస్ ధోని సన్ని లియోన్ సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్,ఎం.ఎస్.ధోని(Twitter/Photo)


ఇందులో ధోనీ, టెండూల్కర్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా..బాలీవుడ్ తార సన్నిలియోన్ మాత్రం నాల్గో ప్లేస్‌లో నిలిచింది. ఇక టీవీ సెలబ్రిటీ గౌతమ్ గులాటి ఆమె కన్న ముందు 3 స్థానంలో ఉండటం విశేషం.  ఎక్కువ మంది నెటిజన్లు వీరి కోసం తెలుసుకోవాలనే ఆరాటంలో వెతుకుంటారు.
First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading