దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంపై అమితాబ్‌కు ప్రముఖుల ప్రశంసలు..

తాజాగా కేంద్ర ప్రభుత్వం బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్‌‌‌ను భారతీయ సినిమా రంగంలోనే అత్యున్నతమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు‌కు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు బిగ్ బీ ఎంపిక కావడంపై సినీ, రాజకీయ, వాణిజ్య రంగాలకు చెందిన వారు అమితాబ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

news18-telugu
Updated: September 25, 2019, 2:38 PM IST
దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంపై అమితాబ్‌కు ప్రముఖుల ప్రశంసలు..
అమితాబ్ బచ్చన్ (File Photo)
  • Share this:
తాజాగా కేంద్ర ప్రభుత్వం బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్‌‌‌ను భారతీయ సినిమా రంగంలోనే అత్యున్నతమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు‌కు ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు కేంద్ర సమాచార మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్‌లో అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ అవార్డు బిగ్‌బీ వరించడంతో దేశ వ్యాప్తంగా అమితాబ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, వాణిజ్య వర్గాలతో పాటు నెటిజన్స్ అమితాబ్‌కు అమితాబ్ బచ్చన్‌కు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు ఝల్లు కురిపిస్తున్నారు.అమితాబ్‌కు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుభాకాంక్షలు తెలియజేసారు.


మరోవైపు అమితాబ్‌కు దేశ అత్యున్నత సినీ పురస్కాారానికి ఎంపిక కావడం పట్ల రజినీకాంత్ ట్వట్టర్ వేదికగా అభినందలు తెలిపారు.


హీరో నాగార్జున..అమితాబ్ బచ్చన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ..ఆయనతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.


మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు అమితాబ్‌కు శుభాకాంక్షలు తెలియజేసారు.మరోవైపు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్..అమితాబ్ బచ్చన్ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించడంతో ఆయన్ను అభినందించారు.
మరోవూపు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు అనిల్ కపూర్, అక్షయ్,అజయ్,వివేక్ ఓబరాయ్ సహా దర్శక నిర్మాతలు కరణ్ జోహార్, ఆదిత్యచోప్రాలు అమితాబ్‌కు శుభాకాంక్షలు తెలియజేసారు.First published: September 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు