Home /News /movies /

MOVIE ARTISTS ASSOCIATION ELECTIONS DATE CONFIRMED AND IT WILL BE HELD ON OCTOBER PK

MAA Elections date: మా అసోసియేషన్ ఎన్నికల తేదీ ఖరారు.. అధ్యక్ష బరిలో ఉన్న ఆరుగురు..!

‘మా’ ఎన్నికల తేదీ ఖరారు (MAA Elections)

‘మా’ ఎన్నికల తేదీ ఖరారు (MAA Elections)

MAA Elections date: కొన్ని రోజులుగా వార్తల్లోనే ఉన్న మా అసోసియేషన్ ఎన్నికల (MAA Elections date) తేదీ ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు మా క్రమశిక్షణ సంఘం దీనిపై అధికారిక సమాచారం ఇచ్చింది. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు తెలిపింది మా కమిటీ.

ఇంకా చదవండి ...
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Movie Artists Association) అనేది చాలా చిన్నది. అక్కడ మహా అయితే 1000 మంది సభ్యులు కూడా ఉండరు. కానీ వాళ్ళ ఎన్నికలు సమీపిస్తుంటే మాత్రం బయట రాజకీయాల కంటే దారుణంగా ఉంటాయి. రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందో అంత వేడి పుట్టిస్తుంటారు మా సభ్యులు. ఉన్న 1000 మందిలోనే ఐక్యత ఉండదంటూ ప్రతీసారి విమర్శలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మేమంతా ఒక్కటి అంటుంటారు కానీ లోపల మాత్రం చాలా గొడవలు జరుగుతూనే ఉంటాయి. మా అసోషియేషన్ పైకి చూడ్డానికి ఒక్కటిగా కనిపిస్తున్నా కూడా లోపల మాత్రం కావాల్సినంత కొట్లాటను దాచేసుకుంటున్నారు. ఈ గొడవలన్నీ సమసిపోవాలంటే ఎన్నికలు రావాల్సిందే అంటూ చాలా రోజులుగా సభ్యులు కోరుకుంటున్నారు. వాళ్లు కోరినట్లుగానే ఇప్పుడు మా అసోసియేషన్ ఎన్నికల తేదీ ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు మా క్రమశిక్షణ సంఘం దీనిపై అధికారిక సమాచారం ఇచ్చింది. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు తెలిపింది మా కమిటీ.

ఎలక్షన్ డేట్ అనౌన్స్ కావడంతో మా అధ్యక్ష బరిలో ఉన్న వాళ్లతో పాటు ప్యానల్ సభ్యులు కూడా సిద్ధం అవుతున్నారు. ఈ సారి అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత, సివిఎల్ నరసింహారావు, కాందబరి కిరణ్ ఉన్నారు. ప్రచారం చేసుకోడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఐదుగురు సభ్యులు ఎన్నికల బరిలో ఉన్నారు. మరి చివరి వరకు ఎంతమంది ఉంటారో చూడాలి. మరోవైపు టైమ్ వచ్చినప్పుడల్లా బయటికి వచ్చి ఒకరిపై ఒకరు విషం చల్లుకుంటూనే ఉన్నారు. ఎప్పుడూ ఇదే జరుగుతుంది.. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. కొన్ని రోజులుగా మా అసోసియేషన్‌లో వివాదాలు బయటికి వస్తూనే ఉన్నాయి.

Tollywood Drugs case: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్స్‌కు ఈడీ నోటీసులు.. లిస్టులో ఉన్న ప్రముఖులు వీరే..


గత వారం రోజులుగా ఈ వార్ మరింత రసవత్తరంగా మారిపోయింది. సీనియర్ నరేష్‌పై హేమ చేసిన కమెంట్స్ నుంచి వార్ మొదలైంది. ఆ తర్వాత హేమపై నరేష్ సీరియస్ కావడం.. అక్కడ్నుంచి మరింత హై రేంజ్‌కు వెళ్లిపోయాయి గొడవలు. తారాస్థాయికి చేరడంతో మధ్యలో చిరంజీవి కూడా కలగజేసుకున్నాడు. క్రమశిక్షణ సంఘానికి లేఖ కూడా రాసాడు. ఈ విషయాలన్ని చర్చించడానికి ఇటీవలే ఆన్‌లైన్‌ వేదికగా ‘మా’ సర్వసభ్య సమావేశం జరిగింది. మా కార్యవర్గ ఎన్నికల నిర్వహణ అంశంపైనే ఇందులో ప్రధానంగా చర్చ జరిగింది.

maa elections,maa elections date confirmed,maa elections october 10th,maa president elections,maa president prakash raj,maa president manchu vishnu,maa president jeevitha rajasekhar,telugu cinema,మా ఎన్నికలు అక్టోబర్ 10,ప్రకాశ్ రాజ్ మా ప్రెసిడెంట్,మంచు విష్ణు మా ప్రెసిడెంట్,జీవిత రాజశేఖర్ మా ప్రెసిడెంట్
‘మా’ ఎన్నిక అధ్యక్ష బరి అభ్యర్ధులు (File/Photos)


క్రమశిక్షణ కమిటీ ఎలా చెబితే అలా చేస్తామని ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ కూడా తన అభిప్రాయాన్ని చెప్పారు. ‘మా’ నిబంధనల ప్రకారం 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని సినీ నటుడు, ‘మా’ అధ్యక్ష అభ్యర్థి ప్రకాష్‌రాజ్‌ సూచించారు. ప్రకాశ్ రాజ్ చెప్పినట్లు చేస్తే సెప్టెంబరు 12వ తేదీన నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించారు. కరోనా కారణంగా కూడా ఈ ఎన్నికలు కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయి. మరి వీళ్ళలో చివరి వరకు ఎవరుంటారో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: MAA Elections, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు