MAA Elections: రంజుగా మా ఎన్నికలు... మంచు విష్ణు ప్యానల్‌లో సభ్యులు వీరే..

Manchu Vishnu Panel Photo : Twitter

MAA Elections: తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న అంటే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో మా ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. కాగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు తాజాగా తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు.

 • Share this:
  తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన ఎలక్షన్స్ (MAA Elections) రోజు రోజుకు రంజుగా మారుతున్న సంగతి తెలిసిందే. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ "మా" ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈసారి మాకు ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికవబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. అది అలా ఉంటే తాజాగా మంచు విష్ణు తన ప్యానల్ సభ్యుల జాబితాను విడుదల చేశారు. మంచు విష్ణు ప్యానెల్ లో జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్ ను ఇదివరకే ప్రకటించగా.. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్స్ గా మాదాల రవి, పృధ్విరాజ్, ట్రెజరర్ గా శివబాలాజీ, జాయింట్ సెక్రటరీస్ గా కరాటే కళ్యాణి, గౌతమ్ రాజు.. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరనాథ్ బాబు, జయవాణి, మలక్ పేట శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖ, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, పి.శ్రీనివాసులు, స్వప్న మాధురి, విష్ణు బొప్పన,వడ్లపట్ల పేర్లను ప్రకటించారు.

  ఇక ఈ మా ఎలక్షన్స్ అక్టోబర్ 10 న జరగబోతున్నాయి. దీనికి సంబదించిన నోటిఫికేషన్ రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్యనే పోటీ ఉండనుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులను పరిచయం చేసి ప్రచారం చేస్తుండగా.. తాజాగా మంచు విష్ణు ప్యానల్ సభ్యులను ప్రకటించారు.  మా ఎన్నికల నోటిఫికేషన్..

  అక్టోబర్ 10వ తేదీన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. ఈ (MAA Elections)మా ఎన్నికలు అక్టోబర్ 10న నిర్వహించాలని కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మా ఎన్నికలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జరగాలని ఇప్పటికే ప్రకాష్ రాజ్, మెగాస్టార్ చిరంజీవి, హేమ తదితరులు కమిటీ చాలాసార్లు కోరిన నేపథ్యంలో ఫౌండింగ్ మెంబర్స్ లో ఒకరైన మురళీమోహన్ సెప్టెంబర్ రెండవ వారం లేదా అక్టోబర్లో ఎన్నికలు జరుపుతామని హామీ ఇచ్చారు.

  NTR : ఫ్యాన్సీ నంబర్ కోసం ఎన్టీఆర్ అంత ఖర్చు చేశారా.. మరో కొత్త కారు వస్తుందిగా..

  అందులో భాగంగా మా ఎన్నికలు అక్టోబర్ 10న జరుగుతాయని అసోసియేషన్ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో (Prakash raj) (Manchu Vishnu) ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్, సివిఎల్‌ నరసింహారావు, మా ప్రెసిడెంట్ గా ఉన్న నరేష్ మా ఎన్నికలలో పాల్గొనబోతున్నారు.

  ఈ ఎన్నికలు ఎనిమిది మంది ఆఫీస్‌ బేరర్స్‌, పద్దెనిమిది మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్స్‌ కోసం జరగనున్నాయి. నామినేషన్లు ఈ నెల 27 నుండి 29 వరకూ స్వీకరిస్తారని తెలిపారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన జరుగునుంది. వచ్చే నెల రెండో తేదీ వరకు నామినేషన్‌ ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇక అక్టోబర్‌ 10న ఎన్నికలు జరుగునున్నాయి. అక్టోబర్ 10న అంటే అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.

  కండీషన్స్ ఇవే..

  ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే... కండీషన్స్ ఇలా ఉన్నాయి. ఒక అభ్యర్ధి ఒక పదవి మాత్రమే పోటీ చేయాలి. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, ఈసీ మీటింగ్స్‌కు 50 శాతం కన్నా తక్కువ హాజరీ ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉండి.. ఆ పదవులకు రాజీనామా చేయకుండా 'మా' ఎన్నికల్లో పోటీ చేయకూడదు.
  Published by:Suresh Rachamalla
  First published: