తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన ఎలక్షన్స్ (MAA Elections) రోజు రోజుకు రంజుగా మారుతున్న సంగతి తెలిసిందే. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ "మా" ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈసారి మాకు ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికవబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. అది అలా ఉంటే ఈ (MAA Elections)మా ఎన్నికలు అక్టోబర్ 10న నిర్వహించాలని కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మా ఎన్నికలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జరగాలని ఇప్పటికే ప్రకాష్ రాజ్, మెగాస్టార్ చిరంజీవి, హేమ తదితరులు కమిటీ చాలాసార్లు కోరిన నేపథ్యంలో ఫౌండింగ్ మెంబర్స్ లో ఒకరైన మురళీమోహన్ సెప్టెంబర్ రెండవ వారం లేదా అక్టోబర్‌లో ఎన్నికలు జరుపుతామని హామీ ఇచ్చారు.
అందులో భాగంగా మా ఎన్నికలు అక్టోబర్ 10న జరుగుతాయని అసోసియేషన్ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో (Prakash raj) (Manchu Vishnu) ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్, మా ప్రెసిడెంట్ గా ఉన్న నరేష్ మా ఎన్నికలలో పాల్గొనబోతున్నారు.
Love Story : లవ్ స్టోరి సినిమాకు భారీ బుకింగ్స్.. లాక్ డౌన్ తర్వాత మొదటిసారి ఈ రేంజ్లో..
ఇక తాజాగా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో తెలుగు చిత్ర ప్రముఖులతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు నగారా మోగినట్లైంది. వచ్చే నెల పదో తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల అధికారి వి. కృష్ణమోహన్ ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మా ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..
ఈ ఎన్నికలు ఎనిమిది మంది ఆఫీస్ బేరర్స్, పద్దెనిమిది మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కోసం జరగనున్నాయి. నామినేషన్లు ఈ నెల 27 నుండి 29 వరకూ స్వీకరిస్తారని తెలిపారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన జరుగునుంది. వచ్చే నెల రెండో తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇక అక్టోబర్ 10న ఎన్నికలు జరుగునున్నాయి. అక్టోబర్ 10న అంటే అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.
Charmee Kaur : తెలుపు రంగు టాప్‌లో మెరిసిపోతున్న ఛార్మి.. పిక్స్ వైరల్..
కండీషన్స్ ఇవే..
ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే... కండీషన్స్ ఇలా ఉన్నాయి. ఒక అభ్యర్ధి ఒక పదవి మాత్రమే పోటీ చేయాలి. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి, ఈసీ మీటింగ్స్‌కు 50 శాతం కన్నా తక్కువ హాజరీ ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్ బేరర్స్‌గా ఉండి.. ఆ పదవులకు రాజీనామా చేయకుండా 'మా' ఎన్నికల్లో పోటీ చేయకూడదు.
ఇక ఈసారి అధ్యక్ష పదవి పోరులో ప్రకాష్ రాజ్, (Prakash raj) (Manchu Vishnu) మంచు విష్ణు, సి.వి.ఎల్.నరసింహారావు మొదలగు వారు ఉన్నారు. అయితే పోటీ మాత్రం ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య ఉంటుందని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Actor prakash raj, MAA Elections, Manchu Vishnu, Prakash Raj, Tollywood news