‘మా’ లో మళ్లీ ముదిరిన వివాదం.. నరేష్ పై చర్యలు తీసుకోవాలని జీవిత లేఖ..

‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌‌లో సభ్యుల మధ్య ఉన్న లుక లుకలు మరోసారి బయటపడ్డాయి. ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ తీరు పై ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

news18-telugu
Updated: January 29, 2020, 9:21 AM IST
‘మా’ లో మళ్లీ ముదిరిన వివాదం.. నరేష్ పై చర్యలు తీసుకోవాలని జీవిత లేఖ..
‘మా’ అధ్యక్షుడు నరేష్‌తో జీవితా రాజశేఖర్
  • Share this:
‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌‌లో సభ్యుల మధ్య ఉన్న లుక లుకలు మరోసారి బయటపడ్డాయి. ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ తీరు పై ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘మా’ అభివృద్ధికి నరేష్ అడ్డు  పడుతున్నారని , నిధులు దుర్వినియోగం చేయడంతో పాటు ఎగ్జిక్యూటివ్ సభ్యలును పట్టించుకోకుండా.. ఒంటెత్తు పోకడలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా జీవితతో పాటు మిగతా ఈసీ సభ్యులు..నరేష్ తీరును ఎండగడుతూ మా క్రమశిక్షణ సంఘానికి 9 పేజీల లేఖ రాశారు. ఈయన గతంలో మా అధ్యక్షుడుగా పనిచేసిన శివాజీ రాజా పై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. అంతేకాదు మా నిధులను నరేష్  దుర్వినియోగం చేశారని ఆరోపించారు.  అంతేకాదు ఆయన తీసుకున్న నిర్ణయాలతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్తిగా భ్రష్టుపట్టి పోవడం ఖాయమన్నారు. ఇక ‘మా’లో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకుంటే.. కనీసం పరామర్శించడం వంటివి చేయడం లేదన్నారు. ఈ సందర్భంగా ఈసీ మెంబరైన  జీవిత తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలై మరో 15 మంది సభ్యులు సంతకం చేశారు. మరి నరేష్ పై ఈసీ సభ్యులు చేసిన ఫిర్యాదుపై క్షమశిక్షణ మండలి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 29, 2020, 9:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading