Rajasekhar: హీరో రాజశేఖర్‌కు మరో బిగ్‌ షాక్..

హీరో రాజశేఖర్‌కు బిగ్ షాక్ ఇచ్చారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. రీసెంట్‌గా జరిగిన జరిగిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ సందర్భంగా..

news18-telugu
Updated: January 5, 2020, 7:18 PM IST
Rajasekhar: హీరో రాజశేఖర్‌కు మరో బిగ్‌ షాక్..
రాజశేఖర్ ఫైల్ ఫోటో
  • Share this:
హీరో రాజశేఖర్‌కు బిగ్ షాక్ ఇచ్చారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. రీసెంట్‌గా జరిగిన జరిగిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అందులో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు వేదికపై ఉన్న చిరంజీవికి ఆగ్రహం కలిగించిన సంగతి తెలిసిందే. వేదికపై రాజశేఖర్ చేసిన పనిని మరో సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా తప్పుపట్టారు. ఎవరికి నచ్చినట్లు వాళ్లు చేస్తున్నారంటూ చిరు సీరియస్ అవ్వడం.. ఇక్కడెవరూ నిజాయితీగా లేరంటూ రాజశేఖర్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మా ఎగ్జిగ్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజశేఖర్ రాజీనామా చేసాడు. ఈ సందర్భంగా రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని మా అసోసియేషన్ మెంబర్స్ తీర్మానించారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ చర్యల కోసం జయసుధ, కృష్ణంరాజు, మోహన్ బాబు, మురళీ మోహన్, చిరంజీవిలతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ సమావేశమై .. రాజశేఖర్ చేసిన రాజీనామాకు ఆమోదం తెలిపింది.  ఈ సందర్భంగా రాజశేఖర్ మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తూ.. రాసిన లేఖను ఆమోదించినట్టు ‘మా’ ప్రెస్ నోట్ విడుదల చేసింది.

movie artist association accept hero rajasekhar resignation
రాజశేఖర్ రాజీనామాకు ఆమెదం తెలుపుతూ లేఖ విడుదల చేసిన ‘మా’ అసోసియేషన్ (Twitter/Photo)
Published by: Kiran Kumar Thanjavur
First published: January 5, 2020, 7:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading