Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. రేటింగ్ విషయంలో కూడా ఈ సీరియల్ మొదటి స్థానంలో ఉంది. ఇక ప్రస్తుతం కథ మరింత ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు కూడా ఈ సీరియల్ ను మిస్ అవ్వట్లేదు. ఇక పిల్లలు తన తల్లి ఎక్కడికి వెళ్లిందని మాట్లాడుకుంటారు. సౌందర్య వచ్చి వాళ్ళ మాటలు విని వాళ్లపై కోప్పడి మళ్లీ ఓదారుస్తుంది. దీప గురించి తను పడుతున్న బాధల గురించి వాళ్లకు వివరిస్తుంది. అంతలోనే హిమ కు మోనిత గుర్తుకు రావడంతో.. ఎక్కడికి వెళ్లింది అంటూ ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తారు. ఇక సౌందర్య నచ్చజెప్పి వాళ్లన పంపించి.. సౌందర్య ఇంకెన్ని అబద్ధాలు చెప్పాలో అనుకుంటూ ఆలోచనలో పడుతుంది. దీపా ఎక్కడికో బయలుదేరినట్లు కనిపించగా మోనిత గురించి ఆలోచనలో పడుతుంది. ఇంట్లో వాళ్ళు తనను నమ్మడం లేదు అంటూ అంతేకాకుండా డాక్టర్ బాబు కూడా నమ్మడం లేదు అనుకుంటూ తనలో తాను కుమిలిపోతుంది.
ఇక దీప తులసి వాళ్ళ ఇంటికి వెళ్లి మోనిత గురించి ఏమైనా తెలుస్తుందేమో అని అనుకుంటుంది. కానీ తులసి కూడా మోనిత చనిపోయింది అని అనుకోవడంతో దీప చెప్పిన మాటలు నమ్మలేకపోతుంది. అంతేకాకుండా దీప పదేళ్లు కార్తీక్ కు దూరంగా ఉన్న విషయాన్ని మాట్లాడుతుండగా దీప తులసిపై అరుస్తుంది. ఏడుస్తూ కుమిలిపోతుంది. మరోవైపు మోనిత అన్నం తింటూ కనిపించగా అక్కడికి రత్నసీత వచ్చి పక్కనున్న బిర్యాని ని చూసి ఆలోచనలో పడుతుంది.
ఇది కూడా చదవండి: మోనిత వచ్చిందని తెలుసుకున్న డాక్టర్ బాబు.. వంటలక్కను చంపేస్తుందని భయపడి!
వెంటనే అది గమనించిన మోనిత అక్కడ కార్తీక్ ఇలాంటి భోజనమే తింటున్నాడు కాబట్టి నేను కూడా ఇదే తింటాను అంటూ మాట్లాడుతుంది. కార్తీక్ ఎలా ఉంటే అలానే ఉంటాను అనుకుంటూ అంటుంది. కార్తీక్ కోసం ఇలా చేస్తున్నాను అంటూ మాట్లాడుతుంది. అలా మాట్లాడుతుండగానే.. రత్న సీతకు తన ప్లాన్ చెబుతుంది. ఈరోజు రాత్రికే జరగాలి అంటూ గట్టిగా చెబుతోంది.ఇక భాగ్యం తన ఇంట్లో దేవుడి ముందు కార్తీక్ దీపల గురించి దండం పెట్టుకుంటుంది. రోషిణి దగ్గరికి కార్తీక్ రాగానే రోషిణి నేను పిలువక ముందే వచ్చావు అంటూ మోనిత శవం గురించి చెబుతావా అనేసరికి కాదు మోనిత గురించి చెబుతాను అంటాడు.
నా దృష్టి లో మోనిత శవంతో సమానం అంటాడు. మోనితే చావలేదంటూ బ్రతికే ఉంది అని తెలుపుతాడు.ఇందాక ఇక్కడికి టీ అమ్మే అమ్మాయిలా వచ్చింది అంటూ జరిగిన విషయాన్ని చెప్పేసరికి రోషిణి..ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి కొత్త కథ తీసుకువచ్చావా అంటుంది. మొత్తానికి రోషిణి కార్తీక్ మాటలు నమ్మకుండా కార్తీక్ పై ఫైర్ అవుతుంది. కార్తీక్ మాత్రం మోనిత గురించి గట్టిగానే చెబుతాడు. ఆ మాటలు విని రోషిణి షాక్ అవుతూ కనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Archana ananth, Doctor babu, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Viswanath, Shobashetty, Soundarya, Vantalakka